ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలోనే చాలా ఆన్లైన్ గేమ్ వెబ్సైట్లను నిషేధించే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మరియు అందరికి పరిచయమున్న EA.com మరియు MiniClip ప్రముఖ గేమింగ్ వెబ్సైట్ తో పాటుగా దాదాపుగా 130 కి పైగా ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్స్ పైన నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్, IT మినిష్టర్ కి పంపిన లేఖలో వున్నట్లుగా ఒక నివేదిక తెలిపింది.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఎక్కువగా జరిగే ప్రమాదం పొంచి వున్న కారణంగా ఈ 130 కి పైగా ఆన్లైన్ గేమ్ వెబ్సైట్లను రాష్ట్ర వ్యాప్తంగా నిషేదించేలా చర్యలను తీసుకోవాలని చూస్తున్నట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.
ఈ విషయం గురించి ముందుగా Gadgets 360 నివేదించింది. ఈ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్, బెట్టింగ్ మరియు జూదం వంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పైపు యువతను ప్రోత్సహించే విధంగా వుండే వెబ్సైట్ లను కూడా నిషేధించాలని తన లేఖలో కోరారు. ఇందులో, EA.com మరియు MiniClip తో పాటుగా దాదాపుగా 130 కి పైగా ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా కూడా ఈ నివేదిక తెలిపింది.
అయితే, ఈ విషయం వివాదాలుకు దారితీస్తుందని కూడా ఈ నివేదిక తెలిపింది. ఎందుకంటే, ఈ లిస్టులో చేర్చినట్లు చెబుతున్న కొన్ని ప్రముఖ వెబ్సైట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎటువంటి ఆన్లైన్ బెట్టింగ్ లేదా మోసాలకు నెలవైన వైబ్సైట్స్ కాకపోవడమే ఇందుకు కారణం. ఇవి నైపుణ్యతను పెంచే గేమ్స్ వెబ్సైట్ గా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే, ఈ లేఖలో సవరించిన AP Gambling ACT, 1947, చట్టాన్ని పరిగణలోకి తీసుకునే విషయాన్ని కూడా వివరించినట్లు, ఈ నివేదిక తెలిపింది.