OMG!! ఐడియా : పైసా ఖర్చు లేకుండా CCTV సెటప్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 23 May 2020
OMG!! ఐడియా : పైసా ఖర్చు లేకుండా CCTV సెటప్
HIGHLIGHTS

పాత ఫోన్లను ఒక సెక్యూరిటీ కెమేరాగా మార్చుకొని ఉపయోగించవచ్చు.

మీరు మీ పాత ఫోన్‌కు కొత్త రూపాన్ని ఇవ్వగలరు.

మీ పాత ఫోన్ను మీ ఇంటి సెక్యూరిటీ కెమెరాగా ఉపయోగించవచ్చనేది ఒక ఉత్తమమైన ఆలోచనగా ఉంటుంది.

Advertisements

Looking for a simpler way to upgrade your applications?

IBM helps you develop and modernize all your applications with Java open systems. Get all the tools, guidance and training that is required to speed up development.

Click here to know more

ప్రస్తుత జీవన విధానం అనుసారంగా, దాదాపుగా ప్రతిఒక్కరూ కూడా తమ రక్షణ కరువైనట్లు భావిచడం సహజంగానే జరుగుతుంది. అంతేకాకుండా, ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా మన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంచడం కూడా వారి రక్షణలో భాగంగా భావిస్తున్నారు. అందుకోసమే, CCTV ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా మన ఇంటి ఆవరణలో మరియు చుట్టూ పక్కలా ఏమిజరుగుతుందో తెలుసుకోవచ్చు. అయితే, ప్రతి ఒక్కరూ కూడా CCTV ని ఏర్పాటు చేసుకోలేరు. ఎందుకంటే, ఇది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కొద్దీ కంటి మాత్రమే దీని ఉపాయోగిస్తారు. అయితే, ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా మీ ఇంట్లో CCTV ని ఎలా సెట్ చేసుకోవచ్చని ఈ రోజు మీకు వివరిస్తున్నాను.  

కానీ, ఈరోజు కేవలం మీ ఇంట్లో మట్టికొట్టుకుపోతున్న పాత ఫోన్లతో ఈ పనిని ఎలా చెయ్యవచ్చునో తెలుసుకోనున్నాము. పాత ఫోన్లు  మీ వద్ద ఉంటే, మీరు వాటిని అమ్మాల్సిన అవసరం లేదు. మీరు వాటిని మరొక ప్రత్యేకమైన మార్గంలో ఉపయోగించవచ్చు. మీరు ఈ పాత ఫోన్లను ఒక సెక్యూరిటీ కెమేరాగా మార్చుకొని ఉపయోగించవచ్చు. ఇంకేముంది, మీకు ఎటువంటి  అధనపు ఖర్చు లేకుండానే మీ ఇంటిని రక్షించడంలో వాటిని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, మీరు వాడుతున్న ఫోన్ను బేబీ మానిటర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు దీన్ని తాత్కాలిక Google హోమ్ స్పీకర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

ఇలాంటివి కొన్ని మంచి ఆలోచనలు, వీటిని ఉపయోగించి మీరు మీ పాత ఫోన్‌కు కొత్త రూపాన్ని ఇవ్వగలరు. ఏదేమైనా, మీ పాత ఫోన్ను మీ ఇంటి సెక్యూరిటీ  కెమెరాగా ఉపయోగించవచ్చనేది ఒక ఉత్తమమైన ఆలోచనగా ఉంటుంది.

మీ పాత ఫోన్‌లో సెక్యూరిటీ కెమెరా యాప్ ని ప్లే చేయండి

ముందుగా, మీరు మీ పాత ఫోన్‌లో సెక్యూరిటీ కెమెరా యాప్ ని ఎంచుకోవాలి. ఇలాంటి సౌకర్యంతో చాలా యాప్స్ Google store లో లభితాయి. మీరు స్థానిక స్ట్రీమింగ్, క్లౌడ్ స్ట్రీమింగ్, రికార్డింగ్‌ను పొందినట్లే, ఫుటేజీని రిమోట్‌గా లేదా స్థానికంగా స్టోరేజి చేసే సదుపాయం కూడా ఇందులో ఉంటుంది. ఇది కాకుండా, మీరు మోషన్ డిటెక్షన్ మరియు హెచ్చరికలను కూడా పొందేవీలుంది.

సెటప్ చేసిన తర్వాత, మీరు మీ ఇంటిలో లేదా ఎక్కడి నుండైనా భద్రతా కెమెరాను నియంత్రించవచ్చు. మీరు దీన్ని మీ క్రొత్త ఫోన్ ద్వారా చేయవచ్చు. మీ ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరా చేసుకోవడానికి Alfred  యాప్ ఉపయోగించడం ఉత్తమ మార్గం. ఇది క్రాస్ ప్లాట్‌ఫాం, అంటే మీ పాత ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ కాదా లేదా ఇది iOS ఆధారిత ఆపిల్ ఐఫోన్ కాదా అన్నది పట్టింపు లేదు. మీరు మీ క్రొత్త ఫోన్‌తో కూడా అదే చేయవచ్చు.

ఈ ALfred ఉచితం, మరియు మీకు ప్రత్యక్ష ఫీడ్ యొక్క రిమోట్ వ్యూ ను అందిస్తుంది, అంతేకాకుండా మీకు చలన గుర్తింపు లభిస్తుంది. ఇది కాకుండా మీరు హెచ్చరికలను కూడా పొందుతారు. మీకు ఇందులో ఉచిత క్లౌడ్ స్టోరేజి లభిస్తుంది. దీనితో పాటు, మీకు టూ-వే  ఆడియో ఫీడ్ కూడా లభిస్తుంది. ఎందుకంటే ఇది ముందు మరియు వెనుక కెమెరా ద్వారా మీకు సమాచారం ఇస్తుంది.

ఏమి చేయాలి

 మీరు Android లేదా iOS స్టోర్ కి  వెళ్లి Alfred యాప్ ని మీ క్రొత్త మరియు పాత ఫోన్‌లలో డౌన్లోడ్ చేయాలి.  మీరు మీ క్రొత్త మరియు పాత టాబ్లెట్‌తో కూడా చేయవచ్చు. అంటే, మీ రెండు ఫోన్‌లలోనూ ఈ యాప్ ని డౌన్‌లోడ్ చేయండి.

దీని తరువాత, మీరు స్టార్ట్ బటన్‌ను చూస్తారు, దానిపై క్లిక్ చేసిన తర్వాత, మీరు ముందుకు వెళతారు, అప్పుడు మీరు వ్యూయర్ ని పొందబోతున్నారు, దాన్ని ఎంచుకుని ముందుకు సాగండి.

ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ చేయమని అడుగుతారు, మీరు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయవచ్చు. మీకు ఇక్కడ Google ఖాతా అవసరం.

మీరు మీ పాత ఫోన్‌లో కూడా ఇలాంటిదే చేయాల్సి ఉంటుంది, అయితే పాత ఫోన్‌లో మీరు వ్యూవర్ కి బదులుగా కెమెరాను ఎంచుకోవాలి. దీని తరువాత మీరు రెండు ఫోన్‌లలో ఒకే ఖాతాకు సైన్ ఇన్ అయ్యారని నిర్ధారించుకోవాలి.

ఇప్పుడు మీ సెటప్ పూర్తయింది, ఇప్పుడు మీరు మీ ఫోన్‌ను మీ ఇంట్లో సరైన స్థలంలో ఉంచాలి, ఆ తర్వాత మీరు మీ ఇతర ఫోన్‌ ఒక సెక్యూరిటీ కెమేరాగా మీకు లైవ్ ఫీడ్ అందిస్తుంది.

logo
Raja Pullagura

Web Title: పైసా ఖర్చు లేకుండా CCTV కెమేరా సెటప్
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు

In light of the government guidelines regarding e-commerce activities, we have currently disabled our links to all e-commerce websites

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status