HIGHLIGHTSఈ మార్గాలతో, మనతో పాటుగా మన చుట్టూఉండే వారిని మన ఫోన్ వెదచల్లే రేడియేషన్ భారి నుండి రక్షించవచ్చు.
ఫోన్ల వాడకం వలన మనకు హానికలిగించే రేడియషన్ ప్రభావం మనకు పొంచి ఉంటుంది.
దీన్ని పూర్తిగా నివారించలేకపోయినా, సరైన పద్దతిలో ఫోన్ను వాడడం వలన దీన్నీచాల వరకు తగ్గించవచ్చు.
Qubo Smart Home Security WiFi Camera
With Intruder Alarm System,Infrared Night Vision,2-way Talk,Works with Alexa
Click here to know more
Advertisementsఈ రోజుల్లో, స్మార్ట్ ఫోన్ జీవితంలో ఒక ప్రధాన భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక రోజును గడపటం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఊహించడానికే చాల కష్టంగా అనిపిస్తోంది కదూ, అవును మనం అంతగా ఫోన్లకు అలవాటుపడిపోయాము. అత్యంత చౌకాగా మార్కెట్లో ఫోన్లు అందుబాటులో ఉండడం కూడా ఫోన్ వాడకం పెరిందనడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నిజానికి, ఇది మంచి విషయమే, ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరు కూడా వారి కొన్ని పనులను స్మార్ట్ ఫోన్ల ద్వారా ఒక కంప్యూటర్ అవసరం లేకుండానే ముగించేస్తున్నారు. అలాగే, అత్యవసర సమయంలో కూడా ఈ ఫోన్లు సహాయపడతాయి. కాయిన్ కు ఒక వైపు బొమ్మ మరొక పైపు బొరుసులాగా, దీని వలన ప్రయోజనాలు ఎన్నున్నాయో దుష్ప్రయోజనాలు కూడా అంతే వున్నాయి.
వాస్తవానికి, ఫోన్ల వాడకం వలన మనకు హానికలిగించే రేడియషన్ ప్రభావం మనకు పొంచి ఉంటుంది. అలాగే, ఈ మధ్య కాలంలో వచ్చే కొన్ని స్మార్ట్ ఫోన్లు అత్యధికమైన రేడియేషన్ ప్రభావాన్ని వెదచల్లుతునట్లు కూడా వచ్చిన కొన్ని నివేదికల ద్వారా మనం చూసాం. అయితే, దీన్ని పూర్తిగా నివారించలేకపోయినా, సరైన పద్దతిలో ఫోన్ను వాడడం వలన దీన్నీచాల వరకు తగ్గించవచ్చు. ఈ క్రింద ఇచ్చిన 5 మార్గాలను పాటించడం ద్వారా కొంత వరకు మీతో పాటుగా మీ చుట్టూఉండే వారిని ఫోన్ వెదచల్లే రేడియేషన్ భారి నుండి రక్షించవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం!
1. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా స్మార్ట్ ఫోన్లే వాడుతున్నాము కాబట్టి, వీలైనంత వరకు కాలింగ్ కి బదులుగా టెక్స్ట్ సందేశాలను పంపడం, లేదా ఫోన్ నుండి కాల్స్ చేయాల్సివచ్చినపుడు బ్లూటూత్ హెడ్ సెట్ లేదా, ఇయర్ ఫోన్స్ వాడడం ద్వారా చాలా వరకు రేడియేషన్ నుండి తప్పిచుకోవచ్చు. ఎలాగంటే, ఫోన్ మాట్లాడేటప్పుడు మన మెదడుకు ద్గగరగా ఫోనులో వుండే యాంటెన్నాఉంటుంది కాబట్టి అది నేరుగా మన మెదడు పైన ప్రభావాన్ని చూపిస్తుంది. పైన తెలిపిన ప్రత్యామ్నాయాల వలన ఫోన్ మన తలకు దూరంగా ఉంటుంది కాబట్టి చాల వరకు రేడియేషన్ తప్పించుకోవచ్చు.
2. అనవసర ఫోన్ వాడకాన్ని తగ్గిచుకోవడం : "అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుంది" అనే సామెత ఇక్కడ కచ్చితంగా నిజమవుతుంది. అతిగా ఫోన్ వాడకం, మీకు ఎనలేని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కేవలం, రేడియేషన్ ప్రమాదమే కాకుండా వత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమితనం వంటి మరెన్నో రుగ్మతలకు కారణమవుతుందని U.S కి చెందిన, నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) 2011 వ సంవత్సరంలోనే దీని గురించి తెలిపింది. కాబట్టి, మీకు అవసంరంలేని సమయంలో వీలైనంత వరకు ఫోనుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
3. రాత్రి సమయంలో ఫోన్ ఆఫ్ చేయండి : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఫోన్లను ఒక అలారం గడియారంలా వాడుతున్నారు. ఇది చాల చిన్న విషయం కదా, అనుకుంటున్నారా ? కాదు, మీరు అలారం పెట్టి ఫోన్ మీ తల దగ్గర పెట్టి పడుకుంటారు అప్పుడు అత్యధికమైన రేడియేషన్ మీరు అందుకుంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో వున్న సరే దానిలోని యాంటెన్నా మరియు బ్యాటరీ రేడియేషన్ ఇస్తాయి కాబట్టి ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం.
4. సిగ్నల్ సరిగ్గా లేనపుడు ఫోన్ వాడకం తగ్గించాలి : ఫోన్ లో సిగ్నల్ వీక్ గా ఉన్నపుడు వీలయినంత వరకూ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే, సిగ్నల్ వీక్ గా ఉన్నపుడూ మన ఫోన్ లోనీ యాంటెన్నాసిగ్నల్ కోసం అత్యదికంగా తరంగాలను విడుదల చేస్తుంది కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తవహించండి.
5. మీతో మీ ఫోన్ను అంటిపెట్టుకుని ఉండటాన్ని తగ్గించండి: ఫోన్ను జేబులో లేదా పౌచ్ తో పాటుగా ఎల్లపుడు మీతోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్నితగ్గించండి. ఇలా మీతో పాటుగా ఎల్లప్పుడు ఫోన్ పీటుకోవడం ద్వారా మీకు రేడియేషన్ ప్రభావం ఉంటుంది. కాబట్టి , మీఫోనుతో పనిలేనప్పుడు మీ నుండి కొంత దూరంలో ఉండేలా చూసుకోండి.
పైన చెప్పిన విధంగా చేయడంవలన, రేడియేషన్ను పూర్తిగా నివారించక పోయినా కూడా చాల వరకు తగ్గించవచ్చు. ఎంత దూరంలో ఉన్నా సరే, మన వారికీ మనం ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేలా చేసే టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నందుకు మనం ఆనందించవచ్చు. కానీ, అతిగా వాడడం వలన కలిగే ముప్పుకు మనమే కారణం అవుతాము.
Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.
మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.