ఓటర్ లిస్ట్ లో మీ ఓటును మొబైల్ ద్వారా చెక్ చెయ్యడం చాలా సులభం

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Sep 2020
HIGHLIGHTS

ఓటర్ ఐడి గురించి పూర్తి వివరాలను చిటికెలో తెలుసుకోవచ్చు

మీరు మీ ఓటర్ ఐడి యొక్క స్టేటస్ తెలుసుకుంటే, మీరు నిశ్చింతగా ఉండవచ్చు.

ఓటరు లిస్టులో మీ వివరాలు మరియు మీ ఓటుకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

ఓటర్ లిస్ట్ లో మీ ఓటును మొబైల్ ద్వారా చెక్ చెయ్యడం చాలా సులభం

Dell Vostro

Power New Possibilities | Dell PCs starting at Rs.35,990*

Click here to know more

Advertisements

ఓటర్లు కొన్నిసార్లు కొన్ని అనివార్య కారణాల వలన తమ ఓటును కోల్పోతారు. అంతేకాదు, ఓటర్ ఐడి లో ఉన్న చిన్న చిన్న తప్పులు గురించి తెలుసుకోకపోవడం వలన, తమ ఓటు హక్కును వినియోగించలేక పోవడం కూడా జరుగుతుంది. అయితే, మీరు మీ ఓటర్ ఐడి యొక్క స్టేటస్ తెలుసుకుంటే, మీరు నిశ్చింతగా ఉండవచ్చు. 

అందుకోసం మీరు చేయాల్సిందల్లా, ఎలక్షన్ కమిషన్ ఓటర్ల ఓటును తనిఖీ చేసుకోవడనికి అందించి వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ సూచించిన కొన్ని వివరాలను అందిస్తే సరిపోతుంది. మీకు దీనిగురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాను.

ఇక్కడ మీరు మీ వివరాలతో పాటుగా ఓటరు ID లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి కావాల్సిన "Form 8"  మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ మార్చుకోవడానికి అవసరమైన "Form 6" మరియు మరికొన్ని ఫారమ్లను కూడా అందుకుంటారు.  

మీ ఓటు యొక్క స్టేటస్ తెలుసుకోవడం ఎలా?

ఈ క్రింది విధంగా చేయండి.  

1.  https://electoralsearch.in వెబ్ సైట్ యొక్క పోర్టల్ లోకి ప్రవేశించాలి.

2. ఇక్కడ సూచించిన దగ్గర మీ పేరును ఎంటర్ చేయాలి

3. దాని క్రింద మీ వయసు లేదా పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి

4. పురును ఎంటర్ చేసిన ప్రక్క బాక్సులో మీ తండ్రి పేరు రాయండి

5. దాని క్రింద మీ జెండర్ (స్త్రీ/పురుషులు) ఎంచుకోండి

6. ఇక రెండవ ప్రధాన బాక్సులో, State అని సూచించిన దగ్గర మీ రాష్ట్రాన్ని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి

7.  దాని క్రింద బాక్సులో District  అని సూచించిన దగ్గర మీ జిల్లాని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి  

8. ఇక చివరిగా మీ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ ని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి

9. అన్నింటికంటే క్రింద ఇచ్చిన "CODE" బాక్సులో అక్కడ అందించిన ఇంగ్లీష్ లెటర్స్ న్టర్ చేసి సెర్చ్ బటన్ పైన నొక్కండి

10. ఇక్కడ సెర్చ్ క్రింద మీ ఓటు వివరాలు వస్తాయి. ఇక్కడ "View Details" పైన నొక్కడంతో పూర్తి వివరాలను చూడవచ్చు. 

logo
Raja Pullagura

Web Title: It is very easy to check your vote on mobile in the voter list
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status