ఎయిర్ కండిషన్ (AC) కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 06 May 2020
HIGHLIGHTS
  • AC ని ఎంచుకోవడానికి కొంత పరిశీలన అవసరం.

ఎయిర్ కండిషన్ (AC) కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!
ఎయిర్ కండిషన్ (AC) కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!

చలికాలం ముగిసింది మరియు సూర్యుడు తన ప్రతాపం చూపించండానికి సిద్దమవుతున్నాడు. ముందు ముందు రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే రోజులు రానున్నాయి. ఎందుకంటే, మన ముందున్నది ఎండాకాలం.  ప్రజలు ఈ ఎండవేడిమి నుండి తప్పించుకోవడానికి, ఫ్యాన్, కూలర్లు మరియు AC లను ఆశ్రయించక తప్పని పరిస్థితి. వీటన్నిటిలో కూడా AC ని  ఎంచుకోవడం మంచిదే, కానీ చాల ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. అలాగే, మార్కెట్లో మనకు చాల చాలా బ్రాండ్స్ యొక్క ఎంపికలు మనల్ని ఏది కొనుగోలు చేయాలనే అయోమయంలో పడేస్తాయి.

అంతేకాదు, AC పరిమాణం మరియు కెపాసిటీ ఇంకా ఏదో కొత్త టెక్నాలజీ అంటూ చాల కంపెనీలు తమ యాడ్స్ తో ఉదరగొడుతుంటాయి. కానీ, వాస్తవానికి AC ని ఎంచుకోవడానికి కొంత పరిశీలన అవసరం. అందుకోసమే, ఒక మంచి AC ని మీరు కొనేలా చేయడానికి, మీకు ఈ శీర్షిక ద్వారా సహాయం చేయనున్నాము. ఇక్కడ మేము సూచించిన ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే, కచ్చితముగా ఒక మంచి AC ని మీరు ఎంచుకోవచ్చు.

1. గది పరిమాణం

AC కొనుగోలు చేసే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఆ AC ని ఏ గదిలో అమర్చాలనుకుంటున్నాము. ఎందుకంటే, మనము ఎంచుకునే గది యొక్క పరిమాణాన్ని బట్టి మనం తెసుకోవాల్సిన AC యొక్క కెపాసిటీ ని అంచనా వేయాల్సి ఉంటుంది.

ఉదా : బెడ్ రూమ్, ఒక సాధారణ బెడ్ రూమ్ కోసం 1 టన్ నుండి 1.2 టన్ కెపాసిటీ AC అవసరమవుతుంది. అదే ఒక మీడియం హాల్ కోసం కనీసం 1.5 టన్ AC అవసరమవుతుంది.

2.  విద్యుత్ వినియోగం

AC కొనేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకొవాల్సిన విషయం, విద్యుత్ వినియోగం అని కచ్చితంగా చెప్పోచ్చు. ఎందుకంటే, AC అత్యధికమైన విద్యుత్ వినియోగాన్ని తీసుకుంటుంది. కాబట్టి, మనకు ఎక్కువ బిల్ వస్తుంది. అందుకోసమే, తక్కువ విద్యుత్ వినియోగాన్ని వాడుకుని ఎక్కువగా పనిచేసేలా వుండే AC లను ఎంచుకోవడం మంచిది. ఎక్కువగా స్టార్స్ ఉన్న AC లు ఎక్కువగా ప్రయోజనాలను ఇస్తాయి.

3. కాపర్ కండెన్సర్ కాయిల్

AC కండెన్సర్లు గాలిని చల్లబరచి మనకు అందించానికి కాయిల్స్ ను ఉపయోగించుకుంటాయి. అయితే, మనకు తెలుసు కాపర్ అత్యంత వేగవంతమైన ఉష్ట్న వాహకమని, కాబట్టి కాపర్ కాయిల్స్ ఉన్న AC లను ఎంచుకోవడం ద్వారా అత్యంత త్వరగా చల్లబరిచే స్వభావాన్ని మీరు మీ AC నుండి పొందుతారు.

4. ఇన్వర్టర్ సాంకేతికత

మీకు పూర్తి సేవింగ్స్ అందించే ఒక స్మార్ట్ AC ని కనుక మ్రు కొనాలనుకుంటే ఇన్వర్టర్ టెక్నలాజి కలిగిన AC ని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే, ఇన్వర్టర్ టెక్నలాజి AC లు అతితక్కువగా విద్యుత్తును వినియోగించుకుని పనిచేస్తాయి. కాబట్టి, మీకు తక్కువగా కరెంట్ బిల్ వస్తుంది. అంతేకాకుండా, ఇందులో అందించే సాంకేతికతతో  AC యొక్క కంప్రెషర్ ఎక్కువ కాలంగా పనిచేస్తుంది.

5. అధనపు ఫీచర్లు

ఒక AC ఎంచుకునేప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సామాన్యంగా, మనకు చాల ఎంపికలతో AC లు దొరుకుతుంటాయి కానీ మన ఇంటి వాతవరణ పరిస్థితులకు అనుగుణమైన ఫిచర్లు కలిగిన వాటిని తెలుసుకుని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీ ప్రాంతంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటే గనుక దానికి అనుగుణంగా హ్యూమిడిఫైర్ కలిగిన AC ని ఎంచుకోవాలి. అలాగే, బ్యాక్టీరియా ని తొలగించే ఎంపిక మరియు అనేక విధాలైన మాకు కావాల్సిన వాటిని ఎంచుకొని వాటన్నిటిని కలిగిన ఒక మంచి AC ఎంచుకోండి.

దీని గురించి ఇంతగా ఎందుకు ఆలోచించాలంటే, ఒక సారి కొంటే  AC ని మళ్లి మళ్లి మార్చలేము కదా, అందుకే మీ డబ్బుకు తగిన విలువను అందిచే సరైన AC కొనండి.                                            

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
ac buying guide
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status