ఇండియాలో తన Mi Credit సేవలను ప్రారంభించిన షావోమి సంస్థ

ఇండియాలో తన Mi Credit సేవలను ప్రారంభించిన షావోమి సంస్థ
HIGHLIGHTS

తక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది.

భారతదేశంలోని వినియోగదారుల కోసం UPI ఆధారిత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన Mi Pay యాప్‌ ను ప్రారంభించడంతో షావోమి ఇండియన్ ఫైనాన్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పుడు, ఇది కొత్తగా Mi credit ను కూడా ప్రకటించింది, ఇది కొత్త ఆన్లైన్ లోన్ ప్లాట్ఫారం, ఇది క్యూరేటెడ్ మార్కెట్ అని చెప్పబడింది మరియు ఇది ఇప్పటివరకు దాని పైలట్ దశలో ఉంది. షావోమి ప్రకారం, ఈ సేవ 2019 నవంబర్‌ లో రోజుకు 1 కోటికీ పైగా రుణాలుగా పంపిణీ చేయబడింది మరియు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 20 శాతం మంది వినియోగదారులు అత్యధికంగా రూ .1 లక్ష వరకూ ఋణం పొందగలిగారు. ఈ ఫీచర్ రియల్ టైమ్ లోన్ పంపిణీ వివరాలను చూపుతుంది మరియు ఇతర పోటీదారులపై తక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది.

మి క్రెడిట్ MIUI నడుస్తున్న అన్ని పరికరాల్లో ముందే ఇన్‌ స్టాల్ చేయబడుతుంది మరియు షావోమి యొక్క స్వంత యాప్ స్టోర్ అయిన గెట్ ఆప్స్ మరియు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌ లోడ్ చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంది. రుణాలు భద్రపరచడానికి సులభమైన అప్లికేషన్ ప్రాసెస్‌ను అందించడానికి ఈ యాప్  ఉపయోగపడుతుంది, ఇందులో డిజిటల్ అప్లికేషన్ను నింపడం చాల సులభమని, ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోదని కూడా చెప్పబడింది. మరలా  తిరిగి లోనే తీసుకునే కస్టమర్లు ఈ ప్రక్రియను చాలా వేగంగా చేయగలుగుతారు. ఆమోదం చాలా స్పష్టంగా "నిమిషాల్లో" జరుగుతుంది మరియు వారి లోన్ యొక్క మొత్తం మరియు సమయాన్ని (టెన్నర్) కూడా వారే ఎంచుకోవచ్చు.

మి క్రెడిట్‌  ప్లాట్‌ ఫామ్‌ లో మల్టి లోన్ భాగస్వాములు ఉన్నారు, అవి ప్రధానంగా NBFC లు లేదా ఫిన్టెక్‌లు, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్, ఎర్లీసాలరీ, జెస్ట్‌మనీ, మనీ వ్యూ మరియు క్రెడిట్విడియా వంటి ప్రధానమైనవి. ఈ ప్లాట్‌ ఫారమ్‌ ను వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తనిఖీ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు మరియు ఈ ఎంపిక వినియోగదారు మరియు వ్యాపార క్రెడిట్ రిపోర్టింగ్ సంస్థ అయిన ఎక్స్‌పీరియన్ చేత పొందుతుంది. షావోమి మి క్రెడిట్‌లోని యూజర్ డేటా మొత్తం దాని భాగస్వామి అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఎన్క్రిప్ర్ట్  చెయ్యబడి భారతదేశంలో స్టోరేజ్ చేయబడిందని పేర్కొంది.

మి క్రెడిట్ 10 కి పైగా రాష్ట్రాల్లో మరియు 1,500 పిన్ కోడ్‌లలో లభిస్తుంది. FY2019 చివరి నాటికి ఈ సేవ యొక్క లభ్యతను 100 శాతం అన్ని పిన్ కోడ్‌లకు విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది, అంటే ఇది 19,000 కంటే ఎక్కువ పిన్ కోడ్‌లను కలిగి ఉండాలి. షావోమి తన మి పే యాప్ కోసం కొన్ని నంబర్లను కూడా విడుదల చేసింది. ఈ సేవ ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే 20 మిలియన్ రిజిస్ట్రేషన్లను సంపాదించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo