60Hz vs 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మధ్య గల వ్యత్యాసం ఏమిటి?

60Hz vs 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మధ్య గల వ్యత్యాసం ఏమిటి?
HIGHLIGHTS

ఇప్పుడు డిస్ప్లే పరంగా కూడా స్మార్ట్ ఫోన్లు మరింత శక్తివంతంగా మారుతున్నాయి.

అసలు డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేటు అంటే ఏమిటి

దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లలో 60Hz రిఫ్రెష్ రేటు కలిగిన డిస్ప్లేలను అందిస్తున్నారు

నానాటికి పెరుగుతున్న టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని మరింత సౌకర్యవంతంగా మరియు మరింత శక్తివంతంగా మారుస్తున్నాయి. ఇప్పటికే, మల్టి కెమెరాలు, 108 MP వంటి పెద్ద కెమెరాలతో పాటుగా ఒక కంప్యూటర్ తో పోటీపడేలా వేగవంతమైన ప్రోసెసర్లతో సహా చాలా హంగులను తమలో ఇముడ్చుకున్నాయి ఈ స్మార్ట్ ఫోన్లు. అయితే, ఇప్పుడు డిస్ప్లే పరంగా కూడా స్మార్ట్ ఫోన్లు మరింత శక్తివంతంగా మారుతున్నాయి.

ఎందుకంటే, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో వస్తున్న డిస్ప్లేలు 60Hz నుండి మొదలుకొని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ డిస్ప్లే వరకు వున్నాయి. కానీ, వీటి మధ్య గల వ్యత్యాసం ఏమిటో మీకు తెలుసా?. అందుకే ఈ డిస్ప్లేల మధ్య గల వ్యత్యాసం గురించి ఈరోజు ఇక్కడ తెలుసుకుందాం.               

అసలు డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేటు అంటే ఏమిటి? దీనితో లాభం ఏమిటి?

మనం వాడే స్మార్ట్ ఫోన్లలో ఉండే స్క్రీన్ (డిస్ప్లే) యొక్క చిత్ర కొలతలను రిఫ్రెష్ రేటు Hz లలో కొలుస్తారు. అంటే, ఒక సెకనుకు డిస్ప్లే రిఫ్రెష్ చేసే ఫ్రెమ్ రేటును Hz లలో కొలుస్తారు. అంటే, ఒక వీడియో లేదా యానిమేషన్ మనం చూస్తున్నప్పుడు సెకనుకు మన స్క్రీన్ చేసే రిఫ్రెష్ రేటు కారణంగా మనం చూసే కంటెంట్, బ్లర్ లాగా లేదా చాలా స్పష్టంగా కనిపించడం వంటి లాభాలను ఇస్తుంది.

60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ప్రయోజనాలు

ప్రస్తుతం, దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లలో 60Hz రిఫ్రెష్ రేటు కలిగిన డిస్ప్లేలను అందిస్తున్నారు. అంటే, ప్రస్తుతం మనం వాడుతున్న ఫోను 60Hz రిఫ్రెష్ రేటుకలిగిన డిస్ప్లే గా మనం చెప్పవచ్చు. ఒకవేళ మీరు ప్రత్యేకంగా 90 లేదా 120Hz రిఫ్రెష్ రేటు డిస్ప్లే కలిగిన స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేస్తే తప్పక మిగిలినవి ఈ కోవకే చెందుతాయి.

వాస్తవానికి, మనం చూసే కంటెంట్ 24fps తో ఉంటుంది. ఇది నేరుగా 24Hz గా మాత్రం ఉండదు. అందుకే, 60Hz డిస్ప్లేలు బ్లూ-రే కంటెంట్ ను ప్లే చెయ్యడానికి కొంచెం  ఇబ్బంది పడతాయి మరియు  ఇవి కంటెంట్ ను విడివిడిగా మార్చి మనకు తక్కువ ఫ్రెమ్స్ తో చూపిస్తాయి. అందుకే మనకు ఈ 60Hz డిస్ప్లేల పైన రేసింగ్, వేగంగా నడిచే మూవీస్ వంటివి పూర్తి స్వచ్చతతో చూపించలేవు. కానీ, మనం సాధారణంగా చూసే కంటెంట్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ఉంటుంది.

120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ప్రయోజనాలు

ప్రస్తుతానికి, కొన్ని స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఈ డిస్ప్లేని అఫర్ చేస్తున్నాయి. వీటిలో కంటెంట్ చూడడం నిజంగా పీక్స్ లో వుంటుంది. ఇది 24fps కంటెంట్ ను నేరుగా మరియు పూర్తి స్వచ్చతతో ప్రసారం చేస్తుంది. ఇక ఈ 120Hz డిస్ప్లేలో బ్లూ-రే వీడియోలు చాలా సున్నితంగా మరియు ఎటువంటి షట్టర్ లేకూండా ప్లే చేస్తుంది. ఇక గేమింగ్ విషయానికి వస్తే, ముఖ్యంగా PUBG వంటి గేమ్స్ ని అత్యధికమైన గ్రాఫిక్స్ తో అల్ట్రా హై డెఫినేషన్ లో ఆడవచ్చు. అంతేకాదు, మీకు ఈ డిస్ప్లే ఎక్కువ ఫ్రెమ్ రేటుతో ఉంటుంది కాబట్టి, ఎటువంటి లాగ్ మీకు కనిపించదు.        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo