Realme 125W UltraDART మీ ఫోన్ను ఎంత వేగంగా ఛార్జ్ చేస్తుందో తెలుసా?

Realme 125W UltraDART మీ ఫోన్ను ఎంత వేగంగా ఛార్జ్ చేస్తుందో తెలుసా?
HIGHLIGHTS

Realme 125W UltraDART ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌ ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

రియల్ మీ తన 125W అల్ట్రా డార్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ సొల్యూషన్ కూడా ఒక 4,000 mAh బ్యాటరీని కేవలం మూడు నిముషాల్లోనే 33% అత్యంత వేగంగా నింపగలదని పేర్కొంది.

Realme 125W UltraDART ఛార్జర్ మల్టీ-లేయర్ ప్రొటక్షన్ చర్యలతో వస్తుంది, ఇది వోల్టేజ్ హెచ్చుతగ్గులు వంటి సమస్యలు లేకుండా సురక్షితమైన ఛార్జింగ్ అంధిస్తుంది.

Realme 125W UltraDART ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌ ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఒప్పో నుండి అంకురించిన ఈ సంస్థ, Oppo తన 125W, 110W ఫాస్ట్ ఛార్జర్లు మరియు 65W వైర్ ‌లెస్ ఛార్జింగ్ డాక్‌ ను ఆవిష్కరించిన ఒక రోజు తర్వాత, ఒప్పో యొక్క 125W ఛార్జింగ్ వలె, రియల్ మీ తన 125W అల్ట్రా డార్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ సొల్యూషన్ కూడా ఒక 4,000 mAh బ్యాటరీని కేవలం మూడు నిముషాల్లోనే 33% అత్యంత వేగంగా నింపగలదని పేర్కొంది.

Realme 125W UltraDART ఫాస్ట్ ఛార్జింగ్ : ఎంత వేగంగా ఛార్జ్ చేస్తుంది

రియల్ మీ యొక్క అల్ట్రా డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ యెంత వేగంగా ఒక స్మార్ట్ ఫోన్ను ఛార్జ్ చేయగలదు అని పరిశీలిస్తే, Realme 125W UltraDART ఫాస్ట్ ఛార్జింగ్ తన అల్ట్రా డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉపయోగించి, ఒక 4000 mAh బ్యాటరీ గల 5G స్మార్ట్ ‌ఫోన్ ‌ను కేవలం 20 నిమిషాల్లోనే 0-100% ఛార్జ్ చేయగలదని, ఇది రియల్ మీ ఎక్స్ 50 ప్రో లో మనం చూసిన 65W ఫాస్ట్ ఛార్జింగ్ కంటే గణనీయమైన అప్ ‌గ్రేడ్ అని చెప్పారు. "అన్ని ఇతర ఫ్లాష్ ఛార్జింగ్ ఎంపికలతో పోలిస్తే, 125W అల్ట్రా డార్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ బ్యాటరీ జీవితాన్ని మెరుగుపరచడానికి మరియు దీర్ఘకాలిక పనితీరును అందించడానికి ఒక ముఖ్యమైన మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన పరిష్కారం" అని రియల్ మీ, మీడియా ప్రకటనలో తెలిపారు.

Realme 125W UltraDART ఫాస్ట్ ఛార్జింగ్ సేఫ్టీ మాటేమిటి ?

సమర్థవంతమైన మరియు దీర్ఘకాలిక వేగవంతమైన ఛార్జింగ్ అనుభవాన్ని అందించడానికి అడాప్టర్ ‌లో నిర్మించిన నియంత్రణల వలన ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే తక్కువగా ఉంచడానికి ఇది వీలు కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది. అల్ట్రా డార్ట్ ఫ్లాష్ ఛార్జర్ మల్టీ-లేయర్ ప్రొటక్షన్ చర్యలతో వస్తుంది, ఇది వోల్టేజ్ హెచ్చుతగ్గులు వంటి సమస్యలు  లేకుండా సురక్షితమైన ఛార్జింగ్ అంధిస్తుంది. అంతేకాదు,  స్క్రీన్ ఆన్ ‌లో ఉన్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఈ 125W ఛార్జర్‌ తో అనుకూలమైన ఫోన్లను ఛార్జ్ చేయవచ్చు.

ఈ అల్ట్రాడార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం ప్రీమియం ఫోన్లకు మాత్రమే సొంతమా ? 

ఈ విషయం పైన కూడా రియల్ మీ తన ఫ్యూచర్ ప్లాన్స్ తెలిపింది. కేవలం ఫ్లాగ్‌ షిప్ ఫోన్ ‌లకు బదులుగా ఈ 125W ఫాస్ట్ ఛార్జింగ్ ‌ను “అన్ని ధరల విభాగాలకు” తీసుకురావాలనే తన ప్రణాళికలను రియల్ మీ సూచించింది, అంటే త్వరలోనే అల్ట్రా డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును మరింత సరసమైన ఫోన్ ‌లలో మనం చూడవచ్చాని అనిపిస్తోంది. కంపెనీ భారతదేశంలో విక్రయించే Realme X50 Pro స్మార్ట్ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది మరియు ఇటీవల సుదీర్ఘ విరామం తర్వాత ఇది తిరిగి అమ్మకానికి వచ్చింది.

అంతర్నిర్మిత 125W అల్ట్రా డార్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉన్న కమర్షియల్ ప్రోడక్ట్ ని మనం ఎప్పుడు చూడగలమో అనే విషయాన్నిమాత్రం రియల్ మీ వెల్లడించలేదు.  అయితే, ఆన్లైన్లో పుట్టుకొచ్చిన కొన్ని రూమర్ల  ద్వారా, ఒప్పో మరియు రియల్ మీ వంటి సంస్థలు 125W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ లను మార్కెట్లకు తీసుకువస్తాయని మనం వాటిని త్వరలో చూడవచ్చని ఊహించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo