Youtube లో అదిరిపోయే ఫీచర్: ఎటువంటి ఆండ్రాయిడ్ ఫోనులోనైనా 4K ప్లే చెయ్యొచ్చు

Youtube లో అదిరిపోయే ఫీచర్: ఎటువంటి ఆండ్రాయిడ్ ఫోనులోనైనా 4K ప్లే చెయ్యొచ్చు
HIGHLIGHTS

Youtube ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

ఇప్పుడు కంటెంట్ ను 4K రిజల్యూషన్ లో కూడా చూడవచ్చు.

మీ ఫోన్ యొక్క డిస్ప్లే రిజల్యూషన్ తో సంభంధం లేకుండా 4K కంటెంట్ చూడవచ్చు.

Youtube ఆండ్రాయిడ్  ఫోన్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మీ ఫోనులో యూట్యూబ్ వీడియోలను చేసేప్పుడు కంటెంట్ కనుక 4K లో అందుబాటులో ఉంటే, మీరు 4K రిజల్యూషన్ లో చూడవచ్చు. ఇప్పటి వరకూ కేవలం 720 మరియు 1080 పిక్సెల్ రిజల్యూషన్ లో మాత్రమే కంటెంట్ ను చేసే వీలుండేది. అయితే, ఇప్పుడు కంటెంట్ ను 4K రిజల్యూషన్ లో కూడా చూడవచ్చు.

Android police అందించిన ఒక రిపోర్ట్ లో ఈ విషయాన్ని ముందుగా తెలిపింది. అయితే, ఈ యూట్యూబ్ 4K కంటెంట్ తో మీకు ఏంటి లాభం అనుకుంటున్నారా? ఖచ్చితంగా లాభం వుంది. ఎందుకంటే, కంటెంట్ ను 4K లో చూడడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అందులోను, మీ ఫోన్ యొక్క డిస్ప్లే రిజల్యూషన్ తో సంభంధం లేకుండా 4K కంటెంట్ చూడవచ్చు.

అయితే, మీ వద్ద కనుక FHD+ లేదా QHD డిస్ప్లే ఫోన్ ఉంటే మాత్రం కంటెంట్ మరింత క్లియర్ మరియు క్రిస్పీ గా ఉండడాన్ని మీరు గమనించవచ్చు. కానీ, రిజల్యూషన్ తక్కువ డిస్ప్లేలో కూడా చక్కగా కనిపిస్తుంది. మీరు ఇంతకు ముందు మీ ఫోనులో చూసిన క్లారిటీ కంటే ఎక్కువ నాణ్యతతో కంటెంట్ ను ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది.

మీ ఫోనులో ఎలా సెట్ చేయాలి?

దీనికోసం ఎటువంటి ప్రత్యేకమైన సెట్టింగ్స్ చేయాల్సిన పనిలేదు. మీరు ఫోన్ యూట్యూబ్ లో కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు పైన కనిపించే మూడు చుక్కల గుర్తు పైన నొక్కడం ద్వారా మీ చూస్తున్న కంటెంట్ ఎటువంటి రిజల్యూషన్ లో అందుబాటులో ఉందన్న విషయం మీకు తెలుస్తుంది. ఇక్కడ మీకు 144P నుండి మొదలుకొని 720 లేదా 1080 వరకూ మీకు ఇప్పటి వరకు అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు మీకు 1440P మరియు 2160P రిజల్యూషన్ కూడా అందించింది. ఇక్కడ మీరు 2160P సెలెక్ట్ చేసుకోవాలి.

అంతే, ఇక మీ ఆండ్రాయిడ్ ఫోనులో కూడా 4K కంటెంట్ ను చక్కగా ఆస్వాదించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo