ఫోర్నిట్ రాయల్ బ్యాటిల్ ఇప్పుడు UK లో విడాకులకు కారణమని పేర్కొన్నారు

HIGHLIGHTS

నివేదికల ప్రకారం, ఫోర్నిట్ బ్యాటిల్ రాయల్ అలాగే ఇతర ఆన్లైన్ గేమ్స్ కారణంగా 2018 ఆరంభం నుంచి 200 విడాకుల పిటిషన్లు దాఖలవడానికి కారణమైనట్లు పేర్కొన్నారు.

ఫోర్నిట్ రాయల్ బ్యాటిల్ ఇప్పుడు UK లో విడాకులకు కారణమని పేర్కొన్నారు

ఫోర్నిట్ బ్యాటిల్ రాయల్ విక్టరీ రాయల్ కోసం పోరాడుతున్న లక్షలాది మంది ఆటగాళ్ళతో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటలలో ఒకటి. అయినప్పటికీ, దాని జనాదరణ ఇపుడు వివాహితులైన జంటల మధ్య నిజ – జీవిత పోరాటాలకు దారి తీస్తుందని చివరకు విడాకులకి దారితీసినట్లు అనిపిస్తుంది. UK- ఆధారిత వెబ్సైట్, divorce-online.co.uk సంవత్సరం ప్రారంభంలో దాఖలు చేసిన 200 విడాకుల పిటిషన్లలో విడాకులకు కారణమైన అంశం బ్యాటిల్ రాయల్ మరియు ఇతర ఆన్లైన్ ఆటలని పేర్కొంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

సంస్థ యొక్క అధికార ప్రతినిధి మాట్లాడుతూ "డ్రగ్స్ అడిక్షన్, ఆల్కాహాల్ మరియు జూదాకు వ్యసనం కావడం వంటివి తరచుగా దంపతుల మధ్య సంబంధం పతనానికి కారణాలుగా సూచించబడ్డాయి కాని ప్రస్తుతం డిజిటల్ విప్లవం యొక్క ప్రారంభ కాలంలో  కొత్త వ్యసనాలకు దారితీసింది." ఇది కాకుండా, విడాకులకు సంబంధించిన ఇతర కారణాలు ఆన్లైన్ అశ్లీలత, ఆన్లైన్లో గేమింగ్ మరియు సోషల్ మీడియా. మొత్తంమీద, ఇవి 2018 ఆరంభం నుంచి కంపెనీచే ఇవ్వబడిన 4,665 పిటిషన్లలో 5% కు సమానమని గుర్తించారు. ఈ సంఖ్యలు కేవలం UK నుండి మాత్రమే ఉన్నాయని గమనించాలి, ఇక్కడ ప్రపంచ స్థాయి సంఖ్యలు చాలా ఎక్కువ.

నిజ జీవితంలో సమస్యలను కలిగించే ఏకైక ఆట ఫోర్నిట్ కాదు. సుమారు ఒక నెల క్రితం, 15 ఏళ్ల బాలుడు PUBG వ్యసనానికి చికిత్స చేయబడ్డారు మరియు ఇంకా చికిత్స పొందుతున్నట్లు నివేదించబడింది. బాలుడు అర్ధరాత్రి వరకూ ఆడతాడని మరియు  పాఠశాలను మానేయడం ప్రారంభించారు. అతను ఆన్లైన్లో 10,000 మిత్రులను కలిగి ఉన్నాడు, కాని నిజ జీవితంలో కొంతమంది మాత్రమే  ఉన్నారు. బాలుడు దానిని సమస్యగా గుర్తించటానికి నిరాకరించిన తరువాత ఈ సమస్య మరింత దిగజార్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే గేమింగ్ డిజార్డర్ కోసం ఒక సలహాను విడుదల చేసింది. ఇది గేమింగ్ ప్రవర్తన యొక్క నమూనాగా వర్గీకరించబడింది, ఇది గేమింగ్ పై బలహీనమైన నియంత్రణకు దారితీస్తుంది, ఇతర కార్యకలాపాల కంటే కూడా గేమింగ్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. మరేదైనా ప్రతికూల పరిణామాలు సంభవించినప్పటికీ గేమింగ్ యొక్క కొనసాగింపు లేదా పెరుగుదల కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

మీరు రోజు మొత్తం గేమింగ్లో  లేదా ఆన్లైన్లో వుండడం కంటే కూడా , మీ కన్నులను తెరపైకి నుంచి పక్కకి మరల్చి మరియు నిజ జీవితంలో మీ చుట్టూ ఉన్న వారితో పరస్పరం సంభాషించడం మంచిది కావచ్చు బహుశా.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo