iPhone లలో మొరాయిస్తున్న PUBG, Spotify వంటి మరికొన్ని ప్రముఖ యాప్స్.. అసలు కారణం ఇదే!

iPhone లలో మొరాయిస్తున్న PUBG, Spotify వంటి మరికొన్ని ప్రముఖ యాప్స్.. అసలు కారణం ఇదే!
HIGHLIGHTS

ఐఫోన్లలో PUBG, Spotyfy మరియు Tinder వంటి మరికొన్ని ప్రముఖ యాప్స్ వినియోగ సమయంలో ఒక్కసారిగా క్రాష్ అయినట్లు తెలుస్తోంది.

PUBG, Spotyfy వంటి మరిన్ని ప్రముఖ యాప్స్ అన్ని కూడా ఒక్కసారిగా పనిచెయ్యడం మానేశాయి

అంతేకాదు, ఓపెన్ చేయ్యడానికి ప్రయత్నించిన ప్రతీసారి, ఒకే పరిస్థితి ఎదురయ్యింది.

PUBG, Spotyfy వంటి మరిన్ని ప్రముఖ యాప్స్ అన్ని కూడా ఒక్కసారిగా పనిచెయ్యడం మానేశాయి, అదీకూడా కేవలం ఐఫోన్ లలో మాత్రమే. ఐఫోన్లలో  PUBG, Spotyfy మరియు Tinder వంటి మరికొన్ని ప్రముఖ యాప్స్ వినియోగ సమయంలో ఒక్కసారిగా క్రాష్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఓపెన్ చేయ్యడానికి ప్రయత్నించిన ప్రతీసారి, ఒకే పరిస్థితి ఎదురయ్యింది. దీనితొ, ఐఫోన్ యూజర్లు ఒక్కసారిగా అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.

అసలు ఏమి జరిగింది?

 ఇంకా పూర్తిగా ధృవీకరించబడనప్పటికీ, ఈ సమస్య ఫేస్‌ బుక్ యొక్క సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK) నుండి కలిగినట్లు చెబుతున్నారు. దీనిని మొబైల్ యాప్స్ విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. సోషల్ మీడియా దిగ్గజం తన డెవలపర్ ప్లాట్‌ఫామ్‌లో ఈ విషయం గురించి తమకు తెలుసునని మరియు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని పోస్ట్ చేశారు.  అయితే, ఈ సమస్య ఇప్పుడు పరిష్కరించబడిందని మరొక కొత్త రిపోర్ట్ కూడా చెబుతోంది.

 

 

ఏయే యాప్స్ క్రాష్ అయ్యాయి ?

IOS పరికారాలను తెరిచినప్పుడు, Pinterest, PUBG మొబైల్, Spotify, TikTok, Tinder, Waze మరియు అనేక ఇతర యాప్స్ క్రాష్ అవుతున్నాయి. ఈ యాప్స్ కోసం తీవ్రమైన అంతరాయం వలన కలిగిన సమస్యలు downdictor.com లో కూడా కనిపించాయి. భారత కాలమానం ప్రకారం, సాయంత్రం 4 గంటలకు ఈ సమస్య గుర్తించబడిందని ఈ వెబ్‌సైట్ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo