ఒక్క ఫోన్ కాల్ తో ఆధార్ వివరాలన్ని గుప్పెట్లో

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 08 Apr 2021
HIGHLIGHTS
  • ఒక్క ఫోన్ కాల్ తో ఆధార్ వివరాలన్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు.

  • కొత్త ఆధార్ హెల్ప్ లైన్ నంబర్

  • ఈ నంబర్ మీకు ఉపయోగపడుతుంది

ఒక్క ఫోన్ కాల్ తో ఆధార్ వివరాలన్ని గుప్పెట్లో
ఒక్క ఫోన్ కాల్ తో ఆధార్ వివరాలన్ని గుప్పెట్లో

ఒక్క ఫోన్ కాల్ తో ఆధార్ వివరాలన్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు. UIDAI ఆధార్ సేవల కోసం ఒక కొత్త ఆధార్ హెల్ప్ లైన్ నంబర్ ను తీసుకొచ్చింది. మీకు మీ ఆధార్ కార్డ్ గురించి ఎటువంటి సమస్య ఉన్నా లేదా ఏదైనా వివరాలు తెల్సుసుకోవలసి వచ్చినా కూడా ఈ నంబర్ మీకు ఉపయోగపడుతుంది. #Dail1947AadhaarHelpLine పేరుతొ ఈ సర్వీస్ నంబర్ ను ప్రకటించింది.

అంటే, మీ ఆధార్ కార్డు గురించి ఏదైనా సమస్య ఉంటే 1947 నంబర్ కి కాల్ చెయ్యడం ద్వారా మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందవచ్చు.  ఇక మీరు మీ ఆధార్ కి సంభందించి ఎక్కడెక్కడ మీ ఆధార్ కార్డ్ ను ఉపయోగించారో తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది విధంగా ఆన్లైన్లో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ క్రింది విధంగా చేయాలి

1.  ముందుగా ప్రభుత్వ అధికారిక UIDAI యొక్క Website ఓపెన్ చేయాలి.

2.  పేజ్ ఓపెన్ అయిన తరువాత సూచించిన దగ్గర మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి మరియు అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ కూడా నమోదు చేసి ఎంటర్ చేయాలి.

3. ఈ విధంగా చేసినతరువాత మీకు మీ యొక్క నమోదుకాబడిన (Registered) మొబైల్ నంబర్ కి OTP వస్తుంది. ఈ OTP కేవలం ముందుగా నమోదు చేయబడిన మొబైల్ నంబరుకు మాత్రమే వస్తుంది.

 4. మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసిన తరువాత మీరు ఆధార్ పేజీ వివరాల్లోకి వెళతారు, ఇక్కడ మీరు మీకు సంబంధించిన వివరాలను చూడొచ్చు.

5. అయితే , ఇక్కడ మీరు ఏయే వివరాలు కావాలనుకుంటున్నారో వాటిని మీరు ఎంచుకోవలసి ఉంటుంది.

6. ఉదాహరణకి : డేట్ ఎంచుకోవడం ద్వారా ఈ డేట్ పరిధిలో ఏవిధమైన సౌకర్యాలకు ఈ కార్డు వాడంబడిదో తెలుస్తుంది.

7. అయితే ఇక్కడ ఎవరు వాడారన్న విషయం మాత్రం తెలుసుకునే వీలులేదు.

గమనిక : సెక్యూరిటీ కారణంగా, ఈ వెబ్సైట్ కొన్నిసార్లు ఓపెన్ కాకపోవచ్చు.                

logo
Raja Pullagura

email

Web Title: get all the details of your aadhaar with a phone call here is all you need to know
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status