15 సెకన్లలో కరోనా టెస్ట్..గాలి ఊదితే చాలు..

15 సెకన్లలో కరోనా టెస్ట్..గాలి ఊదితే చాలు..
HIGHLIGHTS

ఈ కరోనావైరస్ సోకినా వారిని గురించి వారికీ టెస్టింగ్ చేయడంలో జరుగుతన్న జాప్యం కూడా ఈ వ్యాధి వ్యాప్తికి కారణంగా మనం ఊహించవచ్చు.

ఇప్పుడు పరిశోధకులు తీసుకొచ్చిన కొత్త విధానంతో కేవలం 15 సెకన్లలోనే కరోనా టెస్ట్ పూర్తి చేయవచ్చు

ఈ కొత్త Breathalyzer తో, ఎవరైనా కేవలం 15 సెకన్లలోనే కొరోనావైరస్ బారిన పడ్డారో లేదో తెలుసుకోవచ్చు.

దేశంలో కేవలం ఒక్కరోజులోనే 10,00 మందికి పైగా ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారంటే, ఈ మహమ్మారి యొక్క వ్యాపి యొక్క తీవ్రతను మనం అంచనావేయవచ్చు. అయితే, ఈ పరిస్థితి మన రోజువారీ సాధారణ జీవితంలో కూడా చాలా మార్పులు తెచ్చింది, ఇంకా తెస్తోంది. ఈ కరోనావైరస్ సోకినా వారిని గురించి వారికీ టెస్టింగ్ చేయడంలో జరుగుతన్న జాప్యం కూడా ఈ వ్యాధి వ్యాప్తికి కారణంగా మనం ఊహించవచ్చు.

 ప్రస్తుతానికి, కరోనావైరస్ నిర్ధారణ కోసం చేసే పరీక్షలలో నాసికా రంద్రం నుండి సేకరించే నమూనాను, తరువాత వాటిని విశ్లేషించడానికి ల్యాబ్ కి పంపించవలసి వుంటుంది. దీనికి కొన్ని గంటలు లేదా కొన్నిసార్లు కొన్ని రోజులు పడుతుంది.అయితే, ఇప్పుడు పరిశోధకులు తీసుకొచ్చిన కొత్త విధానంతో కేవలం 15 సెకన్లలోనే కరోనా టెస్ట్ పూర్తి చేయవచ్చు మరియు ఇందుకు కేవలం మీరు గాలి ఊదాల్సి ఉంటుంది.            

కానీ, ఈ కొత్త Breathalyzer తో, ఎవరైనా కేవలం 15 సెకన్లలోనే కొరోనావైరస్ బారిన పడ్డారో లేదో తెలుసుకోవచ్చు. దీని అర్థం ఏమిటంటే, విమానాశ్రయాలు, మాల్స్ మరియు వంటి బహిరంగ ప్రదేశాలలో మాస్ స్క్రీనింగ్లు మరియు పరీక్షలు ఇప్పుడు జరుగుతాయి. Medgadget నుండి మొదటిగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం, Breathalyzer వైద్య రంగంలో విస్తృతంగా ఉపయోగించకపోవచ్చు, కాని త్వరలోనే అత్యధికమైన ప్రజాధారణ చూడవచ్చని  పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

ఒక ప్రకటనలో, లీడ్ డెవలపర్ Perena Gouma మాట్లాడుతూ, “ ప్రస్తుతానికి, శ్వాస విశ్లేషణ (Breath analysis) నిజంగా వైద్య రంగంలో ఇంకా విస్తృతంగా ఉపయోగించబడుతున్న సాంకేతికత కాదు, కాబట్టి ఇది ప్రారంభ దశ పనిగా పరిగణించబడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ మరియు VOC లను (volatile organic compounds) శ్వాసలో గుర్తించే సెన్సార్ పరికరం ఇది మరియు ఈ అంటు వ్యాధి ఉంటే దీని గురించి మీకు చెప్పడానికి ఉపయోగించవచ్చు ”. ఈ పరీక్ష చాలా సులభం మరియు చాలా చౌకగా ఉంటుంది. బ్రీత్లైజర్ను కలిగి ఉన్న ఎవరైనా తమపై తాము పరీక్ష కూడా చేయించుకోవచ్చు. ఈ బ్రీత్లైజర్, సంబంధిత వాయువులను సేకరించి కొలిచే కొత్త సూక్ష్మ పదార్ధాలను ఉపయోగిస్తుంది.

ఈ చేతితో పట్టుకొని సులభంగా వినియోగించే ఈ మానిటర్లను విస్తృతంగా పంపిణీ చేయడానికి కూడా ఈ సంస్థ కృషి చేస్తున్నట్లు చెబుతోంది మరియు ఇవి చాలా చవకైనవిగా ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo