OTT లో రిలీజైన విజయ్ దేవర కొండ 'Liger' మూవీ.!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 22 Sep 2022
HIGHLIGHTS
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'Liger' OTT లో రిలీజ్ అయ్యింది

  • విజయ్ దేవర కొండ 'Liger' ఓటిటీ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చింది

  • దక్షిణాది నాలుగు భాషల్లో ఈరోజు నుండి స్ట్రీమ్ అవుతుంది

OTT లో రిలీజైన విజయ్ దేవర కొండ 'Liger' మూవీ.!
OTT లో రిలీజైన విజయ్ దేవర కొండ 'Liger' మూవీ.!

విజయ్ దేవర కొండ (vijay devarakonda) హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'Liger' OTT లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీలో  ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్న ఓటిటీ ప్రేక్షకులకు ఈ సినిమా సర్ ప్రైజ్ ఇచ్చింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా వాస్తవానికి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. Disney+ Hotstar లైగర్ (Liger) సినియాను సైలెంట్ గా విడుదల చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది.

వాస్తవానికి, గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ వచ్చిన వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి. అయితే, డిస్నీ+ హాట్ స్టార్ మాత్రం ఎటువంటి ప్రమోషన్ లేదా ముందస్తు రిలీజ్ ట్రైలర్స్ లేదా టీజింగ్ లేకుండా లైగర్ సినిమాను ఈరోజు రిలీజ్ చేసింది. డిస్నీ+ హాట్ స్టార్ లో తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేసింది మరియు దక్షిణాది నాలుగు భాషల్లో ఈరోజు నుండి స్ట్రీమ్ అవుతుంది.

ఈ సినిమా విజయ్ దేవరకొండ కు బాలీవుడ్ డెబ్యూ మూవీ కాగా మొదటి చిత్రమే నిరాశపరిచింది. కానీ, ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనన్య పాండే హీరో ఇన్ గా నటించగా, రమ్య కృష్ణ విజయ్ తల్లి గా నటించారు. ఈ సినిమాలో లైగర్ కి మాష్టర్ గా రోనిత్ రాయ్ గొప్పగా నటించారు.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Vijay devarakonda Liger movie released on OTT
Tags:
Vijay devarakonda Liger Liger movie released on OTT New movies on OTT Disney+ Hotstar Ananya Panday
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements