సర్కారు వారి పాట: ఈరోజు నుండి ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోంది.!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 23 Jun 2022
HIGHLIGHTS
  • సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా సర్కారు వారి పాట

  • ఈరోజు నుండి ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోంది

  • ఈరోజు నుండి ప్రైమ్ సబ్ స్క్రైబర్స్ అందరికి అందుబాటులోకి వచ్చింది

సర్కారు వారి పాట: ఈరోజు నుండి ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోంది.!
సర్కారు వారి పాట: ఈరోజు నుండి ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోంది.!

సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు OTT లో స్ట్రీమ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్న వారికీ గుడ్ న్యూస్. సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా సర్కారు వారి పాట ఈరోజు నుండి ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోంది. నిన్నటి వరకూ అమెజాన్ ప్రైమ్ వీడియో లో పే ఫర్ వ్యూ అప్షన్ తో మాత్రమే అందుబాటులో వున్నా సర్కారు వారి పాట మూవీ, ఈరోజు నుండి ప్రైమ్ సబ్ స్క్రైబర్స్ అందరికి అందుబాటులోకి వచ్చింది. అంటే, ఇప్పుడు కుటుంభం మొత్తం ఇంట్లోనే కలిసి కూర్చొని ఈ సినిమా ని చూడవచ్చు.

సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో మే 2న విడుదలయింది మరియు భారీ కలక్షన్స్ కూడా సాధించింది. అమెజాన్ ఈ సినిమా OTT రైట్స్ ను భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది. ముందుగా, ఈ సినిమాను జూన్ 2 నుండి రెంటల్ అప్షన్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చింది. విడుదలకు ముందునుండే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ సాధించడమే కాకుండా బ్లాక్ బాస్టర్ మూవీగా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్స్ అందరి కోసం రిలీజ్ అయ్యింది.

ఎప్పుడు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ తో ముందుకొచ్చే మహేష్ బాబు ఈ సారి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రస్తుతం సమాజంలో వున్న మరియు సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంభీరమైన విషయాన్ని గురించి చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. పరుశురామ్ దర్శత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా కొనియాడబడింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న బ్యాంక్ స్కామ్స్ గురించి వాటికి ఎలా పరిష్కరించవచ్చు అనే విషయాన్నిప్రజలకు చెప్పే ప్రయత్నమే ఈ సినిమా కధ.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Sarkaru vaari paata now streaming on prime video
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status