జూలై నెలలో OTT లో రిలీజ్ అయిన మరియు కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీస్..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 02 Jul 2022
HIGHLIGHTS
  • జూలై 1 నుండి OTT లో స్ట్రీమ్ అవుతున్నకొత్త సినిమాలు

  • మరొక రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలు రిలీజ్ డేట్ తో ఊరిస్తున్నాయి

  • అప్ కమింగ్ బ్లాక్ బాస్టర్ మూవీస్

జూలై నెలలో OTT లో రిలీజ్ అయిన మరియు కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీస్..!!
జూలై నెలలో OTT లో రిలీజ్ అయిన మరియు కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీస్..!!

జూలై నెలలో OTT ప్రారంభమవుతూనే మొదటి రోజునే థియేటర్లలో ప్రదర్శించబడుతున్న సినిమా OTT లో రిలీజ్ అయ్యింది. ఇది మాత్రమే కాదు ఈ నెలలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన లేటెస్ట్ తెలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే రెండు కొత్త సినిమాలు జూలై 1 న  ఓటీటీలో రిలీజ్ అవ్వగా, మరొక రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలు రిలీజ్ డేట్ తో ఊరిస్తున్నాయి. ఇంకెందుకు ఆలశ్యం, జూలై నెలలో OTT లో రిలీజ్ అయిన మరియు కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీస్ పైన ఒక లుక్ వేద్దాం పదండి.

జూలై 1 నుండి OTT లో స్ట్రీమ్ అవుతున్నకొత్త సినిమాలు

విరాట పర్వం

దగ్గుబాటి రానా మరియు సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' జూలై 1 నుండి OTT లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాలో కథ, సన్నివేశాలు మరియు తారల నటన వంటి అన్ని అంశాల్లో కూడా మంచి పాజిటీవ్ టాక్ అందుకుంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన కలక్షన్లను సాధించలేక పోయింది. ఈ సినిమా జూలై 1 అంటే, ఈరోజు నుండి Netflix నుండి స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమా చూడలేక పోయిన వారు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూడవచ్చు.          

పృథ్వీరాజ్

సామ్రాట్ పృథ్వీ రాజ్ చౌహన్ జీవితం ఆధారంగా నిర్మిచిన చారిత్రక యాక్షన్ డ్రామా సినిమా ఈ 'సామ్రాట్ పృథ్వీ రాజ్'. పృథ్వీ రాజ్ చౌహన్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించగా సంజయ్ దత్ మరియు సోనూ సూద్ ప్రధాన పాత్రలను పోషించారు. జూన్ 3 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా కూడా ఈరోజు నుండి Prime Video నుండి ట్రీమ్ అవుతోంది.

అప్ కమింగ్ బ్లాక్ బాస్టర్ మూవీస్

Major

అడివి శేష్ అద్భుత నటనా చిత్రం 'మేజర్' OTT లో జూన్ 3న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా Netflix నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా 26/11 ముంబై దాడిలో వీర మరణం పొందిన 'సందీప్ ఉన్ని కృష్ణన్' జీవిత వృత్తాంతాన్ని (బయో పిక్) సినిమాగా నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో వుంది మరియు 26/11 ముంబై దాడి కధానాలను కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా, శశి కిరణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

Vikram

బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించిన కమల్ హాసన్ బ్లాక్ బాస్టర్ మూవీ 'విక్రమ్' కూడా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. జూలై 8 నుండి ఈ సినిమా Disney+ Hotstar నుండి స్ట్రీమ్ అవుతుంది. చాలాకాలం తరువాత కమల్ హాసన్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్ సినిమాగా 'Vikram' ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా తమిళ నాట బాహుబలి సినిమా కలక్షన్ రికార్డ్ ను సైతం వెనక్కు నెట్టింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.  రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో లొకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపు దిద్దుకుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: ott upcoming movies July 2022
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements