రికార్డు సృష్టించిన Netflix వెబ్ సిరీస్ Money Heist

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 25 Jan 2022
HIGHLIGHTS
  • Money Heist సిరీస్ ఒక స్పానిష్ వెబ్ సిరీస్

  • ఈ సిరీస్ అత్యధిక మైన గంటలు చూడబడిన వెబ్ సిరీస్ గా రికార్డ్ సృష్టించింది

  • 670 కోట్ల గంటలు చూడబడిన వెబ్ సిరీస్ గా కొత్త రికార్డ్ సృష్టించింది

రికార్డు సృష్టించిన Netflix వెబ్ సిరీస్ Money Heist
రికార్డు సృష్టించిన Netflix వెబ్ సిరీస్ Money Heist

ప్రపంచ నలుమూలల నుండి అనేక భాషల్లో కంటెంట్ ను అందిస్తూ, OTT ప్లాట్ఫారంలో అగ్ర వేదికగా కొనసాగుతన్న Netflix లో దేశీయ మరియు విదేశీ అన్ని రకాల సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు తరచుగా విడుదల చేయబడతాయి. ప్రపంచ వ్యాప్తంగా జనాదరణ పొందిన చాలా సినిమాలు నెట్‌ఫ్లిక్స్ పైన కనిపిస్తాయి. ఇలాంటి కోవకు చెందినదే Money Heist సిరీస్ మరియు ఇది ఒక స్పానిష్ వెబ్ సిరీస్. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మైన గంటలు చూడబడిన వెబ్ సిరీస్ గా రికార్డ్ సృష్టించింది. ఈ సిరీస్ ఇప్పటి వరకూ 670 కోట్ల గంటలు చూడబడిన వెబ్ సిరీస్ గా కొత్త రికార్డ్ సృష్టించింది.   

Money Heist :       

ఈ సిరీస్ కి పెట్టిన పేరే ఈ సిరీస్ కథ అదే Money Heist (డబ్బు దోపిడీ). ఇది Netflix లో యూజర్లకు అత్యధికంగా నచ్చిన సిరీస్ గా  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, వీక్షకుల సంఖ్య ద్వారా కూడా రికార్డులను బద్దలు కొట్టింది మరియు ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా మారింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది స్పెయిన్‌లో విడుదలైనప్పుడు ఫ్లాప్ అయ్యింది. కానీ, ఇండియాలో పలుభాషల్లో తర్జుమా తర్వాత హిట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Netflix లో ఈ సిరీస్ ఒరిజినల్ స్పానిష్ భాషతో పాటుగా తెలుగు, హిందీ, తమిళం మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. ఇటీవల, నెట్‌ఫ్లిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో Money Heist వెబ్ సిరీస్ 6,700,000,000 గంటలు అంటే, ప్రపంచవ్యాప్తంగా 6700 మిలియన్ గంటలు వీక్షించబడిందని అధికారిక సమాచారం ఇచ్చింది.           

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: netflix web series money heist breaks 670 crore hours viewed record
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status