ఆచార్య తో సహా ఈవారం OTT లో ఒకేరోజు రిలీజ్ కానున్న 3 కొత్త సినిమాలు..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 15 May 2022
HIGHLIGHTS
  • ఈ వారం OTT లో ఒకేరోజు 3 కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి

  • RRR తో పాటుగా మరొక రెండు కొత్త సినిమాలు మే 20 న ఓటీటీ లో విడుదల అవుతున్నాయి

  • 'ఆచార్య' మే 20 న అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అవుతోంది

ఆచార్య తో సహా ఈవారం OTT లో ఒకేరోజు రిలీజ్ కానున్న 3 కొత్త సినిమాలు..!!
ఆచార్య తో సహా ఈవారం OTT లో ఒకేరోజు రిలీజ్ కానున్న 3 కొత్త సినిమాలు..!!

ఈ వారం OTT లో ఒకేరోజు 3 కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ సంవత్సరపు బ్లాక్ బాస్టర్ మూవీ RRR తో పాటుగా మరొక రెండు కొత్త సినిమాలు మే 20 న ఓటీటీ లో విడుదల అవుతున్నాయి. గత వారంలో బీస్ట్ మరియు ది కాశ్మిర్ ఫైల్స్ వంటి చిత్రాలు ఓటీటీ లో విడుదల కాగా ఈ వారం కూడా మొత్తం మూడు తెలుగు సినిమాలు ఓటీటీలో స్ట్రీమ్ అవుతాయి. వీటిలో, మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' కూడా వుంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవనున్న  కొత్త సినిమాలు ఏమిటో ఒక లుక్ వేద్దామా.

RRR

దర్శక ధీరుడు S S రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు Jr.NTR అద్భుతమైన నటనతో వచ్చిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టడమే కాకుండా ప్రజల గుండెలో  నిలిచిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1,000 కోట్లకు పైగా కలక్షన్స్ సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. RRR మూవీ మే 20 న Zee 5 మరియు Netflix రెండు ప్లాట్ ఫామ్స్ నుండి స్ట్రీమ్ కాబోతోంది. ఈ సినిమా OTT లో ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా ఆనందాన్నిచ్చే వార్తే అవుతుంది.

ఆచార్య

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' మే 20 న అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అవుతోంది. ఇటీవలే  భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే, సినిమాలో మెగాస్టార్ మరియు రామ్ చరణ్ ల అద్భుతమైన నటన మరియు డాన్స్ రెండు ఆకట్టుకునే అంశాలు. అంతేకాదు, 'భలే బంజారా' ఫుల్ వీడియో సాంగ్ ను కూడా విడుదల చేశారు.

భళా తందనానా

శ్రీవిష్ణు మరియు కేథరీన్ జంటగా నటించిన క్రైం థ్రిల్లర్ 'భళా తందనానా' కూడా ఇదే వారం మే 20న Disney+ HotStar నుండి స్ట్రీమ్ కాబోతోంది. ఎప్పుడు ఏదోఒక విలక్షణమైన కథ మరియు పాత్రలను మాత్రమే చేసే శ్రీవిష్ణు మరొకసారి మంచి సినిమాతో ముందుకు వచ్చాడు. మార్చ్ 6 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించేలేక పోయింది. కానీ, శ్రీవిష్ణు యాక్టింగ్, పోసాని మరియు సత్య ల కామెడీ కేథరీన్ గ్లామర్ వంటి ఆకట్టుకునే అంశాలు వున్నాయి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: 3 new Telugu movies going to stream on OTT on 20th may
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status