FAU-G గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం సిద్ధం

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 01 Dec 2020
HIGHLIGHTS
  • FAU-G కోసం ప్రీ-రిజిస్ట్రేషన్లను తెరిచినట్లు కోర్ గేమ్ ప్రకటించింది

  • ఆసక్తి ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్‌లో ఆట కోసం ముందే నమోదు చేసుకోవచ్చు.

  • ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకటించారు.

FAU-G గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం సిద్ధం
FAU-G గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం సిద్ధం

FAU-G: ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ గేమ్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్లను తెరిచినట్లు కోర్ గేమ్ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు  గూగుల్ ప్లే స్టోర్‌లో ఆట కోసం ముందే నమోదు చేసుకోవచ్చు. ఆట యొక్క హైప్‌ ను సొమ్ము చేసుకునేందుకు చూస్తున్న అన్ని నకిలీ FAU-G క్లోన్‌లను గూగుల్ సమర్థవంతంగా ప్రక్షాళన చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది.

ఇక ఈ భారతీయ గేమ్ గురించి గుర్తుకుచేసుకుంటే , ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకటించారు. డెవలపర్లు అక్టోబర్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు, అక్కడ నవంబర్ చివరి నాటికి ఆటను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. డౌన్‌లోడ్ కోసం ఆట ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియదు. ప్రీ-రిజిస్టర్ ఎంచుకున్న వారు ఆట డౌన్‌లోడ్ కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటుందో తెలియజేయడానికి ఎంచుకోవచ్చు లేదా ఆట అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆటొమ్యాటిగ్గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ గేమ్ యొక్క రూపం ఆట గురించి మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇందులో గేమ్ యొక్క వివరణ, దాని వయస్సు రేటింగ్ మరియు స్క్రీన్ షాట్ ఉన్నాయి, ఇది ఆట యొక్క ప్రధాన మెనూను చూపిస్తుంది.

logo
Raja Pullagura

email

Web Title: Now FAU-G available for pre-registration on the Google Play Store
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status