ఈ Air Purifier ఉంటే కార్బన్డయాక్సిడ్ (CO2) ని కూడా వదలదు

ఈ Air Purifier ఉంటే కార్బన్డయాక్సిడ్ (CO2) ని కూడా వదలదు
HIGHLIGHTS

గాలిలోని అనేక ఇతర ఆమ్ల వాయువులను పీల్చుకోవడానికి ప్రత్యేకమైన విధానంతో నిర్మించబడింది.

పూర్తిగా భారతీయ సాంకేతికతతో, Air OK సంస్థ తన విస్టార్ కంఫర్ట్ సిరీస్ ఎయిర్ ప్యూరి ఫయర్లను విడుదల చేసింది. ఈ ప్యూరి ఫయర్లను EGAPA కంఫర్ట్ ఫిల్టర్‌తో అందిస్తోంది, ఇది కార్బన్ డయాక్సైడ్ మరియు గాలిలోని అనేక ఇతర ఆమ్ల వాయువులను పీల్చుకోవడానికి ప్రత్యేకమైన విధానంతో నిర్మించబడింది.

ఈ కంఫర్ట్ ఫిల్టర్, పూర్తిగా దేశీయంగా తయారు చేసిన పేటెంట్ టెక్నాలజీ అయిన EGAPA (ఎఫిషియంట్ గ్రాన్యులర్ అడ్సోర్బెంట్ పార్టిక్యులేట్ అరెస్టర్) ద్వారా పనిచేస్తుంది. ఇది వివిధ వాయు కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ శక్తివంతమైన ఫిల్టరుతో, విస్టార్ కంఫర్ట్ ప్యూరి ఫయర్స్  అనేకమైన అప్లికేషన్లను కలిగి ఉన్నాయి. Air OK యొక్క ఈ విస్టార్ కంఫర్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లు 15  స్క్వేర్ మీటర్ల నుండి 104 స్క్వేర్ మీటర్ల వరకు గల ప్రాంతంలోని  గాలి నాణ్యతను సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది.

విస్టార్ కంఫర్ట్ ఎయిర్ ప్యూరి ఫయర్లు యుని-టచ్ ఇంటర్‌ ఫేస్‌ తో సులభంగా పనిచేయగలవు, వినియోగదారులు దీన్ని చాలా సులభంగా  వాడవచ్చు. ఇక డిజైన్ పరంగా చూస్తే, పై భాగంలో పూర్తి గ్లాస్ ఫినిషింగ్ లుక్, ఆఫీస్ లేదా ఇంటి లోపలి ఇంటీరియర్స్ యొక్క ఎలైట్ లుక్‌ ను జోడిస్తుంది. ఇది చాలా తక్కువ – శబ్దం మాత్రమే చేస్తుంది మరియు రోజంతా ఇంటి/ఆఫీస్ లోపల గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ స్మార్ట్ ఎయిర్ ప్యూరి ఫయర్లు Wi-Fi & క్లౌడ్ కనెక్టివిటీతో వస్తాయి.  వినియోగదారులు,  వీటిని మొబైల్ యాప్స్ ద్వారా సులభంగా నియంత్రించవచ్చు. అయితే, మీ గదిలో ఉన్న గాలిలోని కార్బన్ డయాక్సైడ్ (CO2) స్థాయిలను బట్టి ప్రతి 8-12 నెలల్లో, ఫిల్టర్లను మార్చవలసి ఉంటుంది.

ఈ సిరిస్ విడుదల సందర్భంగా, AirOK టెక్నాలజీస్ డైరెక్టర్ అయినటువంటి, పవన్ రెడ్డి యాసా వీటి గురించి మాట్లాడుతూ,  "మెరుగైన ప్రొడక్టివిటీ కోసం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి, ఈ విస్టార్ కంఫర్ట్ సిరీస్ ప్రారంభించబడింది" అని  అన్నారు.

" వాతావరణంలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్ (CO2) యొక్క స్థాయిలు ప్రజలను వారి ఆలోచనా సామర్థ్యాలు, శక్తి స్థాయిలు మరియు మరెన్నో వాటిపైన ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. వాస్తవానికి, ఎయిర్ కండిషన్డ్ (AC) వాతావరణాన్ని అందించడంతో పాటు, ఉద్యోగులు మరింత చురుకుగా, వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడానికి అవసరమయ్యే ఇండోర్ ఎయిర్ నాణ్యతను మెరుగుపరచడం కూడా కంపెనీలకు అవసరం " అని Air Ok టెక్నాలజీస్ యొక్క హెడ్ సేల్స్ & ఆపరేషన్స్ అయిన, విశేష్ కౌల్ పేర్కొన్నారు.

ఇండోర్ కార్బన్ డయాక్సైడ్ (CO2) స్థాయిలు 650 ppm కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ఉన్న ప్రదేశాలో, చిరాకు, పరధ్యానంతో పాటు, ఎలివేటెడ్ కార్బన్ డయాక్సైడ్ (CO2) స్థాయిలు ఉద్యోగులలో బద్ధకం మరియు మగతను ప్రేరేపిస్తాయి. విస్టార్ కంఫర్ట్ ప్యూరిఫైయర్స్ గాలి నాణ్యతను ఆప్టిమైజ్ చేయడానికి అధిక కార్బన్ డయాక్సైడ్ (CO2) మరియు ఇతర వాయు కాలుష్య కారకాలను విశ్లేషించడానికి మరియు గ్రహించడానికి ఒక వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాయి.

ఈ ప్యూరి ఫయర్లు వివిధ ఫీచర్లు మరియు వివిధ సామర్థ్యాల ఆధారంగా రూ .25 వేల రూపాయల వరకు లభిస్తాయి. ప్రస్తుతానికి, ఇవి ఆఫ్‌ లైన్ స్టోర్లలో లభిస్తున్నాయి మరియు త్వరలో ఆన్‌ లైన్‌ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo