AC కొనడానికి వెళ్తున్నారా!! అయితే ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 12 Apr 2021
HIGHLIGHTS
  • మంచి AC కోసం చూస్తున్నారు

  • ఎటువంటి ఫీచర్లు గమనించాలి

  • కన్ఫీజ్ అవుతున్నారా

AC కొనడానికి వెళ్తున్నారా!! అయితే ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
AC కొనడానికి వెళ్తున్నారా!! అయితే ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఎండలు మండిపోతున్నాయి. ఇంకేముంది, AC కోసం వేట మెదలయ్యుంటుంది. అయితే, టీవిలో వచ్చే యాడ్స్ లేదా ఎదురింటి వాళ్ళ సలహాలో పక్కింటి వారి సూచనలో ఎక్కువగా మీ బుర్రను హీట్టెక్కేంచి ఉంటాయి. ఇవన్నీ కాకుండా మీ ఇంటికి ఒక మంచి AC కొనడానికి అవసరమైన 5 ముఖ్యమైన విషయాలను ఇక్కడ అందిస్తున్నాను. ఈ 5 విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీకు తగిన AC ని సునాయాసంగా ఎంచుకోవచ్చు.                       

AC పరిమాణం మరియు కెపాసిటీ ఇంకా ఏదో కొత్త టెక్నాలజీ అంటూ AC కంపెనీలు తమ యాడ్స్ తో ఉదరగొడుతుంటాయి. కానీ, వాస్తవానికి AC ని ఎంచుకోవడానికి కొంత పరిశీలన అవసరం.

1. గది పరిమాణం

AC కొనుగోలు చేసే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఆ AC ని ఏ గదిలో అమర్చాలనుకుంటున్నాము. ఎందుకంటే, మనము ఎంచుకునే గది యొక్క పరిమాణాన్ని బట్టి మనం తెసుకోవాల్సిన AC యొక్క కెపాసిటీ ని అంచనా వేయాల్సి ఉంటుంది.

ఉదా : బెడ్ రూమ్, ఒక సాధారణ బెడ్ రూమ్ కోసం 1 టన్ నుండి 1.2 టన్ కెపాసిటీ AC అవసరమవుతుంది. అదే ఒక మీడియం హాల్ కోసం కనీసం 1.5 టన్ AC అవసరమవుతుంది.

2.  విద్యుత్ వినియోగం

AC కొనేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకొవాల్సిన విషయం, విద్యుత్ వినియోగం అని కచ్చితంగా చెప్పోచ్చు. ఎందుకంటే, AC అత్యధికమైన విద్యుత్ వినియోగాన్ని తీసుకుంటుంది. కాబట్టి, మనకు ఎక్కువ బిల్ వస్తుంది. అందుకోసమే, తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువగా పనిచేసేలా వుండే AC లను ఎంచుకోవడం మంచిది. ఎక్కువగా స్టార్స్ ఉన్న AC లు ఎక్కువగా ప్రయోజనాలను ఇస్తాయి.

3. కాపర్ కండెన్సర్ కాయిల్

AC కండెన్సర్లు గాలిని చల్లబరచి మనకు అందించానికి కాయిల్స్ ను ఉపయోగించుకుంటాయి. అయితే, మనకు తెలుసు కాపర్ అత్యంత వేగవంతమైన ఉష్ట్న వాహకమని, కాబట్టి కాపర్ కాయిల్స్ ఉన్న AC లను ఎంచుకోవడం ద్వారా అత్యంత త్వరగా చల్లబరిచే స్వభావాన్ని మీరు మీ AC నుండి పొందుతారు.

4. ఇన్వర్టర్ సాంకేతికత

మీకు పూర్తి సేవింగ్స్ అందించే ఒక స్మార్ట్ AC ని కనుక మీరు కొనాలనుకుంటే ఇన్వర్టర్ టెక్నలాజి కలిగిన AC ని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే, ఇన్వర్టర్ టెక్నలాజి AC లు అతితక్కువగా విద్యుత్తును వినియోగించుకుని పనిచేస్తాయి. కాబట్టి, మీకు తక్కువగా కరెంట్ బిల్ వస్తుంది. అంతేకాకుండా, ఇందులో అందించే సాంకేతికతతో  AC యొక్క కంప్రెషర్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.

5. అధనపు ఫీచర్లు

ఒక AC ఎంచుకునేప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సామాన్యంగా, మనకు చాలా ఎంపికలతో AC లు దొరుకుతుంటాయి కానీ మన ఇంటి వాతవరణ పరిస్థితులకు అనుగుణమైన ఫిచర్లు కలిగిన వాటిని తెలుసుకుని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీ ప్రాంతంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటే గనుక దానికి అనుగుణంగా హ్యూమిడిఫైర్ కలిగిన AC ని ఎంచుకోవాలి. అలాగే, బ్యాక్టీరియా ని తొలగించే అప్షన్ మరియు అనేక విధాలైన ఫీచర్లతో మీకు కావాల్సిన వాటిని ఎంచుకొని వాటన్నిటిని కలిగిన ఒక మంచి AC ఎంచుకోండి.

దీని గురించి ఇంతగా ఎందుకు ఆలోచించాలంటే, ఒక సారి కొంటే  AC ని మళ్లి మళ్లి మార్చలేము కదా, అందుకే మీ డబ్బుకు తగిన విలువను అందిచే సరైన AC కొనండం మంచిది

logo
Raja Pullagura

email

Web Title: these are the most five important things need to remember before buying a air conditioner
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung 1.5 Ton 5 Star Split Dual Inverter AC - White  (AR18TV5HLTUNNA/AR18TV5HLTUXNA, Alloy Condenser)
Samsung 1.5 Ton 5 Star Split Dual Inverter AC - White (AR18TV5HLTUNNA/AR18TV5HLTUXNA, Alloy Condenser)
₹ 36990 | $hotDeals->merchant_name
Whirlpool 1.5 Ton 3 Star Split Inverter AC - White  (1.5T MAGICOOL PRO Plus 3S COPR INV, Copper Condenser)
Whirlpool 1.5 Ton 3 Star Split Inverter AC - White (1.5T MAGICOOL PRO Plus 3S COPR INV, Copper Condenser)
₹ 29999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status