#India Project.

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 13 Aug 2019
HIGHLIGHTS
  • భారతీయ చిన్న పారిశ్రామికవేత్తలను విజయవంతం చేయడంలో సహాయపడదాం ...

#India Project.
#India Project.

ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాలుగా, డిజిట్ లో ఉన్న మనమందరం ఒకే లక్ష్యంగా - భారతదేశం యొక్క టెక్నాలజీ నావిగేటర్ గా నడపబడుతున్నాము. మన దేశాన్ని మనకు తెలిసిన సాంకేతిక సూపర్ పవర్‌గా మార్చగలగాలి (మరియు ఇలా ఉండాలి). ఆగష్టు మనందరికీ ప్రత్యేకమైనది, ఎందుకంటే మేనము 1947 లో స్వాతంత్ర్యం పొందిన తరువాత మన దేశం యొక్క పుట్టుకను జరుపుకుంటాము, మరియు మనము సాధారణంగా భారతీయ విజయాలను వ్యాసాలు మరియు వీడియోల రూపంలో జరుపుకుంటూనే, ఇంకా ఎక్కువ చేయటానికి అనేక మార్గాలను వెతుకుతున్నాము.

మీడియా సంస్థగా, మా బలం , మీకు సరికొత్త సమాచారాన్ని అందించడంలో ఉంది. ప్రతి ఇతర మీడియా సంస్థ కూడా అదే పనిచేస్తుంది, మరియు మనమందరం కూడా  ప్రకటనల ద్వారా సంపాదించిన డబ్బుతో మనుగడ సాగిస్తాము. సాధారణంగా, కంపెనీలు మిమ్మల్ని చేరుకోవాలని మరియు వారి ఉత్పత్తుల గురించి మీకు తెలియజేయాలని కోరుకుంటాయి మరియు వారు అలా చేయడానికి ఒక మంచి సాధనముగా మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు.

అయితే ఈ వ్యవస్థ కొంచెం పక్షపాతంతో ఉంటుంది, ఎందుకంటే పెద్ద కంపెనీలు మీ దృష్టిలో పడటానికి ఎక్కువగా చెల్లించడానికి సుముఖతను చూపిస్తాయి, ఇంకా చెబితే, మధ్య తరహా కంపెనీలు, చిన్న కంపెనీల కంటే చాలా పెద్ద బడ్జెట్‌లను కలిగి ఉంటాయి మరియు తదితర కంపెనీలు కూడా ఉంటాయి. తత్ఫలితంగా, ఒక పారిశ్రామికవేత్తగా (భారతదేశంలోనే కాదు) మొదటి నుండి ప్రారంభించడం అంటే, మీ చేతులు మీ వెనుక భాగంలో కట్టివేయబడటమే కాకుండా, మీ కాళ్ళను చైన్ తో  బంధించబడి, మరియు ఇటుకలతో నిండిన బ్యాక్‌ప్యాక్ మీకు కట్టబడి మీరు రేసులో పాల్గొనాల్సివుంటుంది. ! ఇది దాదాపు అసాధ్యం అనిపిస్తుంది.

ఇప్పుడు, మమ్మల్ని తప్పు పట్టవద్దు, మేము రాడికల్ సోషలిజం వైపు పయనించడం లేదు, లేదా వీనస్ ప్రాజెక్ట్ ఊహించిన విధంగా జీవించడం ప్రారంభించటానికి తీవ్రంగా మారాలని సూచించడం, లాంటిదేమీ లేదు. అతిపెద్ద కంపెనీలు చాలా పెద్దవి ఎందుకంటే అవి అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తాయి మరియు అవి పెద్దవి కావడంలో తప్పు లేదు. ఏదేమైనా, మీడియా సంస్థగా మీకు తగినంత సమాచారం ఇవ్వడంలో మా పాత్రను మేము ఇంకా ఎలా పెంచాలో చూస్తాము, అది మీకు సాధ్యమైనంత సమాచారం ఇవ్వడానికి ఉత్తమంగా చేస్తుంది. అక్కడ ఉన్న చాలా మంది భారతీయ టెక్ వ్యవస్థాపకుల గురించి మనకు కూడా తెలియకపోతే మనం ఏమి చేయగలం? ఖచ్చితంగా, పెద్ద మెట్రో నగరాలు మరియు ఢిల్లీ , కర్ణాటక లేదా మహారాష్ట్ర వంటి ధనిక రాష్ట్రాల్లో జరుగుతున్న విషయాలపై మాకు చాలా మంచి సమాచారం ఉంది, కానీ నిజాయితీగా, మీరు చాలా చిన్న రాష్ట్రంలో టెక్ వ్యవస్థాపకులైతే, మేము మీ గురించి వినడానికి ఎప్పటికీ అవకాశముండదు.

ఇది మారాలి.

#IndiaProject

ఒక చిన్న టెక్ కంపెనీని నిర్మించటానికి అతను లేదా ఆమె జీవితాన్ని అంకితం చేసిన ప్రతి భారతీయ టెక్ వ్యవస్థాపకుడి నుండి మేము వినాలనుకుంటున్నాము. మరీ ముఖ్యంగా, మీరు, మా పాఠకులు, జూనియర్ నారాయణ మూర్తులందరి నుండి వినాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి దీన్ని మనము ఎలా చేయాలి?

మేము భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక్కొక్కటికి ఒకటి లేదా రెండు నెలలు కేటాయించబోతున్నాము మరియు వారి వ్యాపారం గురించి వివరాలను మాకు ఇవ్వడానికి ఆ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్న సాంకేతిక వ్యవస్థాపకులను ఆహ్వానించనున్నాము. మా వెబ్‌సైట్‌లో వారి వ్యాపారం గురించి ఒక అంకితమైన పేజీని సృష్టించడానికి మేము వారికి సహాయం చేస్తాము మరియు లక్కీ డ్రా ద్వారా మేము ఎంచుకునే కొద్దిమంది కోసం ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు మరియు ప్రకటనలను కూడా ముద్రింస్తాము. పైన పేర్కొన్నవన్నీ చేయటానికి అన్ని అనుబంధ మానవవనరులు మరియు మెటీరియల్ ఖర్చుల కోసం మేము బిల్లును అడుగుతాము.

మీ నుండి, మా పాఠకుల నుండి మాకు కావలసింది ఈ కథనాన్ని, మీకు ఆసక్తి ఉన్న కంపెనీల పేజీలు, ప్రకటనలు మరియు సోషల్ మీడియా పోస్టులను పంచుకోవడం (మిగతా వాటి నుండి వేరు చేయడానికి వాటిని “# India Project ” అని ట్యాగ్ చేస్తారు), తద్వారా ప్రత్యేకమైన భారతీయ కంపెనీల గురించి ప్రచారం చేయడానికి మేము సమిష్టిగా సహాయపడతాము.

ప్రారంభం!

కాబట్టి మనం ఎక్కడ ప్రారంభించాలి? మేము జమ్మూ కాశ్మీర్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నాము. ఈ రోజుల్లో అన్ని సరిహద్దులను అధిగమించేది ఒక్కటే, అది సంగీతం కాదు, అది సాంకేతికత. కాబట్టి అందరం కలిసికట్టుగా, జమ్మూ & కాశ్మీర్ లోని  మన సోదరులు మరియు సోదరీమణులు చేస్తున్న పనుల గురించి అవగాహన పెంచుకుందాం, మరియు ఈ ప్రాంతానికి చెందిన ఒక సాంకేతిక వ్యవస్థాపకుడు మీకు తెలిస్తే, ఈ కథనాన్ని వారితో షేర్ చేయండి మరియు టెక్నాలజీ పట్ల వారి అభిరుచిని మరియు వారి పనిని మాతో షేర్ చెయ్యడానికి మమ్మల్ని సంప్రదించండి.

ఇది పైలట్ ప్రాజెక్ట్ అయినందున మేము చాలా ఒకేసారి దూసుకెళ్లడం మాకు ఇష్టం లేదు, కానీ మా జాబితాలో తదుపరిది సిక్కిం… ప్రస్తుత ప్రాజెక్ట్ ప్రాంతానికి మార్పుల కోసం ఈ క్రింది స్థలాన్ని చూడండి.

కాపీ లెఫ్ట్

ఈ ఆలోచన భారతదేశం యొక్క ఉత్తమ ఆసక్తి ఇది ఏ ఒక్క ఆకారంలోనూ, రూపంలోనో పరిమితం కాలేదు, . దీన్ని కాపీరైట్ చేయడానికి ప్రయత్నించే బదులు, మేము ఈ ఆలోచనను కాపీలేఫ్ట్ (పబ్లిక్ డొమైన్) గా విడుదల చేస్తున్నాము. మొత్తం చందాదారులతో (ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విచ్, టిక్‌టాక్, మొదలైన వాటిలో) అన్ని ఇతర మీడియా హౌస్‌లను లేదా ప్రభావితము చేసేవారు వారి స్వంత పంధాలో చురుకుగా చేయమని మేము ప్రోత్సహిస్తున్నాము. మీరు జనాదరణ పొందిన నటుడు అయితే, మీరు భారతదేశం అంతటా చిన్న ఇండీ చిత్ర నిర్మాతల కోసం దీన్ని చేయవచ్చు. టెక్నాలజీతో సహా ఏ రంగంలోనైనా పారిశ్రామికవేత్తల కోసం మీడియా హౌస్‌లు దీన్ని చేయగలవు. దీనికి అవధులులేవు, ఆకాశమే హద్దు!

మీరు మా లాంటి హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలనుకుంటే - “# IndiaProject” - అలా చేయడానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. ఒకవేళ ఇలా కాకపోతే, మీరు మీ స్వంత క్యాచ్‌ఫ్రేజ్‌తో రావాలనుకుంటే, దానికి కూడా మేము మిమల్ని స్వాగతిస్తున్నాము! మా ఏకైక లక్ష్యం చిన్న తరహా భారతీయ పారిశ్రామికవేత్తలకు కొంత ఉచిత ప్రకటనలను అందించడంలో సహాయపడటం, మరియు మీరు అలా చేస్తున్నంత కాలం, మేము మిమల్ని అభిమానిస్తాము!

మీరు మా పాఠకులుగా ఉండి మరియు దీన్ని మీ స్నేహితులతో షేర్ చేస్తే, మీ తోటి భారతీయులకు సహాయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు.

జై హింద్ !

The not-so-fine print for entrepreneurs

ప్రస్తుత ప్రాజెక్ట్ ప్రాంతం - జమ్మూ కాశ్మీర్

India@digit.in కు , మీ కంపెనీ మరియు మీరు చేసే పనుల వివరాలను మాకు వ్రాసి పంపండి. ఒక టెక్నాలజీ మీడియా హౌస్ కావడంతో, మీ ఉత్పత్తి లేదా సర్వీస్  ఒక టెక్నాలజీ ప్రదేశంలో డిజిట్ కు అవసరం, టెక్నాలజీ యొక్క తుది వినియోగదారులను కూడా ఏదో ఒక విధంగా లక్ష్యంగా చేసుకోవాలి.

మీ కంపెనీ పైన జాబితా చేయబడిన ప్రాజెక్ట్ ప్రాంతంలో స్థాపించబడాలి మరియు పేర్కొన్న ప్రాంతంలో చూపించే రిజిస్టర్డ్ చిరునామాతో కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్‌ను మాతో షేర్ చేయాలనీ మేము మిమల్ని కోరుతున్నాము.

చిన్న కంపెనీలకు సహాయం చేయడానికి మేము ఇలా చేస్తున్నందున, మీరు సంవత్సరానికి 5 కోట్ల లోపు టర్నోవర్ కలిగి ఉండాలి. దయచేసి మీ తాజా ఆడిట్ చేసిన P&L స్టేట్మెంట్ కాపీని మీ అప్లికేషన్‌లో భాగంగా చేర్చండి.

మేము వెబ్ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రమోషన్ మరియు పత్రిక ప్రకటనల కోసం నెలకు 10/15 కంపెనీల మధ్య ఎంచుకుంటాము. ఈ ఎంపిక లక్కీ డ్రా ద్వారా మాత్రమే ఉంటుంది మరియు ఒక ప్రకటన, సోషల్ మీడియా లేదా ప్రకటన ముద్రణ కోసం ఎంపిక చేయబడిన తర్వాత, ప్రతి కంపెనీకి ఒక సారి మాత్రమే  ప్రయోజనం లభిస్తుందని నిర్ధారించడానికి, ఆ కంపెనీ పేరు డ్రా నుండి తీసివేయబడుతుంది.

కావాలనుకుంటే, ఈ కంపెనీలు తదుపరి ప్రకటనలను రాయితీ ధరలతో కొనుగోలు చేయవచ్చు, కానీ ఇది ‘# IndiaProject’ బ్యానర్ పైన ఉండదు. ‘# IndiaProject’ బ్యానర్ క్రింద అన్ని ప్రకటనలు / ప్రమోషన్ లు ఎల్లప్పుడూ ఉచితం మరియు లక్కీ డ్రా ద్వారా మాత్రమే ఎంపిక చేయబడతాయి.

9.9 Media యొక్క ఏ ఉద్యోగి యొక్క బంధువులు ఈ ఆఫర్‌కు అర్హులు కాదు.

Team Digit
Team Digit

Email Email Team Digit

Follow Us Facebook Logo Facebook Logo Facebook Logo

About Me: All of us are better than one of us. Read the detailed BIO to know more about Team Digit Read More

Tags:
india indiaproject
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status