అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్స్ లో అందరికన్నా ముందుగా ఏలా కొనాలి: స్మార్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్

బై PJ Hari | పబ్లిష్ చేయబడింది 30 Sep 2016
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్స్ లో అందరికన్నా ముందుగా ఏలా కొనాలి: స్మార్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్

FLIPKART BIG BILLION SALES టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో చదవగలరు.
Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కంప్లీట్ సమాచారం ఈ లింక్ లో చూడగలరు.

ఈ సేల్స్ లో ఎంత గొప్ప డిస్కౌంట్స్ ఉన్నా, సరైన time లో deals ఫినిష్ అయిపోయేలోపు వాటిని అందరికన్నా త్వరగా ఏలా పొందాలి అనే విషయం కొన్ని టిప్స్ తెలపటానికే ఈ ఆర్టికల్ వ్రాయటం జరిగింది. ముందుగా మీరు షాపింగ్ చేయబోయే యాప్స్ అన్నీ లేటెస్ట్ గా అప్ డేట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే కంపెనీలు బిగ్ సేల్స్ కోసం యాప్ ఫాస్ట్ గా ఉండేలా మరియు కొత్త ఆఫర్స్ కనిపించేలా అప్పుడప్పుడు ఆఫర్స్ ముందే యాప్స్ ను అప్ డేట్ చేయటం జరుగుతుంది.

AMAZON Buying Tips:

 • ముందుగా ఈ లింక్ లోకి వెళ్లి అమెజాన్ prime కు subscribe అవ్వండి. ఇది మొదటి నెల free సర్వీస్. కాని ఆ తరువాత నెల నుండి prime కు వన్ ఇయర్ కు 500 rs తీసుకుంటుంది అమెజాన్. సో prime వలన మీకు అందరికన్నా 30 నిముషాలు ముందుగా deals కనిపిస్తాయి. prime మెంబెర్స్ కాని వారికి deals లేట్ గా కనిపిస్తాయి.
 • prime ప్రొడక్ట్స్ అన్నీ మినిమమ్ cost అంటూ లేకుండా ఎంత తక్కువ ప్రోడక్ట్ కొన్న free డెలివరీ మరియు మీ సిటీస్ బట్టి ఫాస్ట్ one day నుండి 2 day డెలివరీ అవుతాయి. సెపరేట్ గా మీరు prime ప్రొడక్ట్స్ కు ఫిల్టర్ చేసి కూడా సర్చ్ చేయగలరు ఐటమ్స్ ను.
 • Next మీరు నిజంగా కొందామని వెయిట్ చేస్తున్న వస్తువులను ADD TO CART ఆప్షన్ ద్వారా కార్ట్ లోకి యాడ్ చేసుకొని పెట్టుకొండి. సో సేల్స్ మొదలయినప్పుడు వాటిని వెంటనే BUY చేయగలరు.
 • అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రస్తుత ఆక్టివ్ డెలివరీ అడ్రెస్ మరియు పేమెంట్ ఆప్షన్స్ ను default గా సెట్ చేసుకోండి.
 • అన్నిటి కన్నా ముఖమైనది మీరు LOG IN అయ్యి ఉండాలి.
 • డెస్క్ టాప్ users ఈ లింక్ లోకి వెళ్లి అమెజాన్ అఫీషియల్ బ్రౌజర్ plugin అయిన అసిస్టెంట్ ను ఇంస్టాల్ చేసుకోండి. సో మీకు deals గురించి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి బ్రౌజర్ లో.
 • ఈ లింక్ లో కనిపించే మొబైల్స్ పై డిస్కౌంట్స్ ఉండే అవకాశం ఉంది. సో వీటిని కార్ట్ లోకి యాడ్ చేసుకొని పెట్టుకోండి. రేపు కార్ట్ ఓపెన్ చేసి వీటి prices ను చెక్ చేసుకోండి. తగ్గితే మరియు మీరు నిజంగా కొనే ఆలోచనలో ఉంటే వెంటనే buy ఆప్షన్ ఉపయోగించటమే. అయితే వీటికి అంత కంగారు పడనవసరం లేదు. కేవలం highest డిస్కౌంట్స్ తో వచ్చే deals మాత్రమే వెంటనే అయిపోతాయి.

 

FLIPKART Buying Tips:

 • flipkart లో ఐటమ్స్ ను కొనే ముందు అమెజాన్, స్నాప్ డీల్ వంటి మిగిలిన సైట్స్ లో ఏ prices కు వస్తుందో చూడండి. అవును స్నాప్ డీల్ కూడా అక్టోబర్ 2 నుండి 7 వరకూ 70% OFF ఆఫర్స్ తో DIWALI సేల్స్ చేస్తుంది.
 • మీరు లాగ్ in అయ్యి ఉండేలా చూసుకోండి డెస్క్ టాప్ అండ్ యాప్ లో. ఇప్పుడు మీ అడ్రెస్ అండ్ పేమెంట్ లను డిఫాల్ట్ చేసి పెట్టుకొండి. default అంటే రెండు మూడు అడ్రెస్ అండ్ పేమెంట్స్ ఉన్నవారు వాటిని అప్ డేట్ చేసుకొని ఉండటం మంచిది.
 • అలాగే SBI డెబిట్ కార్డ్ పై ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ ఉంది కాబట్టి, మీరు డెబిట్ కార్డ్ ను ఫ్లిప్ కార్ట్ లో పేమెంట్ mode లో యాడ్ చేసి దానిని డిఫాల్ట్ పేమెంట్ గా సెట్ చేసుకోవటం మంచిది.
 • refrigerators, tv's వంటి పెద్ద పెద్ద వస్తువులు కొనే వారు, Flipkart Assured అనే సింబల్ ఉన్న ఐటమ్స్ ను ప్రిఫర్ చేయటం మంచిది. ఎందుకంటే ఇవి క్వాలిటీ ను బాగా చెక్ చేసి షిప్పింగ్ చేయటం జరుగుతుంది. అండ్ 500 రూ మించిన ఏ ప్రోడక్ట్ అయినా free అండ్ ఫాస్ట్ డెలివరీ కలిగి ఉంటుంది.
 • అలాగే మీరు అడ్రెస్ లో ప్రెసెంట్ వర్కింగ్ నంబర్స్ ను పెట్టుకోండి. వేరే వ్యక్తి కి ఐటెం కొనాలనుకుంటే వారి అడ్రెస్ అండ్ నంబర్ ను కూడా ముందే ఎంటర్ చేసి పెట్టుకోవటం కరెక్ట్.
 • మీ డెలివరి అడ్రెస్ పిన్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనా ప్రోడక్ట్ మీకు డెలివరీ అవుతుందో లేదో తెలుసుకోవటం కోసం పనిచేస్తుంది.
 • అన్నిటికీ మించి మీరు సీరియస్ గా ఏదో particular ఐటెం కొనే ప్లాన్స్ లో ఉంటే కనుక దానిని అన్ని సైట్స్ లో ఒక సారి ఏ prices లో ఉందో చూసి నచ్చిన వాటిని కార్ట్/wish లిస్టు కు యాడ్ చేసుకొని పెట్టుకోవటం బెటర్. సో ఆఫర్స్ రోజు మీరు వాటిని ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి ప్రైస్ తగ్గినా తగ్గక పోయినా వెంటనే చెక్ అవుట్ చేసి కొనగలరు. గమనిక: ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్ లో తెలియజేయగలరు.

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status