లేటెస్ట్ గా డిసెంబర్ 1 న ముకేష్ అంబానీ అనౌన్స్ చేసిన Jio Happy New Year Offer గురించి మీకు ఉండే కంప్లీట్ డౌట్స్ కు ఇక్కడ జవాబులు వ్రాయటం జరిగింది చూడగలరు.
అసలు ఏంటి Happy New Year Offer?
డిసెంబర్ 31 వరకూ welcome offer ఉంది కదా. అలాగే ఇది కూడా same అవే ఫ్రీ సర్వీసెస్ అందిస్తూ మరింత పొడిగింపు కాలం (మార్చ్ 21, 2017 వరకూ) తో వస్తున్న సరికొత్త ఆఫర్. ఫ్రీ సర్వీసెస్ అంటే unlimited వాయిస్ అండ్ వీడియో కాలింగ్, ఇంటర్నెట్, SMS అండ్ యాప్స్ సర్వీసెస్.
ఎవరెవరికి ఉంటుంది ఈ కొత్త ఆఫర్?
Jio ఆల్రెడీ తీసుకున్న వారికీ మరియు ఇంకా తీసుకోని వారికి(కొత్తగా తీసుకుంటే).. అందరికీ వర్తిస్తుంది ఈ ఆఫర్.
ఆల్రెడీ welcome offer తో Jio సిమ్ వాడుతున్నాము, మాకు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది కొత్త ఆఫర్?
ఆల్రెడీ Jio ఫ్రీ సర్వీసెస్ ఆస్వాదిస్తున్న వారికి డిసెంబర్ 31న Welcome offer మిగిసిపోతుంది, ఆ వెంటనే జనవరి 1 నుండి Happy New Year Offer ఆటోమాటిక్ గా అప్ డేట్ అయిపోతుంది. సో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కొరకు మీరు మళ్ళీ కొత్త సిమ్ తీసుకోనవసరం లేదు. 1 వ తేదిన మార్పుకు సంబంధించిన డిటేల్స్ My Jio యాప్ లో చూడగలరు.
మరి Jio సిమ్ ను కొత్తగా తీసుకునేవారికి ఎప్పుడు నుండి వర్తిస్తుంది కొత్త హాపీ న్యూ ఇయర్ ఆఫర్?
కొత్తగా సిమ్ తీసుకునే వారికి డిసెంబర్ 4, 2016 నుండి హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అప్లై అవుతుంది. అయితే ఎవరికి ఎప్పుడు అప్లై అయినా, హ్యాపీ న్యూ ఆఫర్ ఆఖరి తేదీ మాత్రం మార్చ్ 31,2017.
డిసెంబర్ 4 న స్టార్ట్ అవుతుంది కొత్త ఆఫర్ అంటున్నారు. అంటే వెల్కమ్ ఆఫర్ డిసెంబర్ 3 న ముగిసిపోతుందా?
లేదు. పనిచేస్తుంది. డిసెంబర్ 4 నుండి కేవలం కొత్తగా సిమ్ తీసుకునే వారి కొరకు అందించిన అవకాశం.
కొత్తగా సిమ్ తీసుకునే వారికి, డిసెంబర్ 4 నుండి welcome ఆఫర్ ఇవ్వకుండా కొత్త ఆఫర్ ఎందుకు ఇస్తుంది కంపెని?
టెలికాం రూల్స్ ప్రకారం ప్రోమోషనల్ ఆఫర్స్ అనేవి 3 నెలలకు మించి ఎక్కువ కాలం ఫ్రీ గా అందించకూడదు. ఈ విషయం పై ఇతర టెలికాం నెట్ వర్క్స్ TRAI కు కంప్లైంట్ చేశాయి. అందుకే రిలయన్స్ సెప్టెంబర్ 5 న స్టార్ట్ అయిన welcome offer Jio ఫ్రీ సర్వీసెస్ డిసెంబర్ 3 న ముగిస్తుంది. " కొత్త Jio సిమ్ తీసుకునే వారికి welcome ఆఫర్ పేరుతో ఇచ్చే ఫ్రీ సర్వీసెస్ ఆఫర్" ను ముగించేసింది.
అదే ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నప్పుడు Welcome Offer అని కాకుండా Happy New Year Offer అని ఎందుకు పేరు పెట్టడం?
పైన చెప్పినట్లు 3 నెలలకు మించి ఫ్రీ ప్రోమోషనల్ ఆఫర్ ఇవ్వకూడదు కాబట్టి కంపెని తెలివిగా పేరు మార్చి డిసెంబర్ 4 నుండి మరలా అదే ఫ్రీ సర్వీసెస్ అందిస్తుంది.
మేము ఇంకా సిమ్ తీసుకోలేదు, సో ఎలా తీసుకోవాలి?
గతంలో చేసిన ప్రోసెస్ నే ఇప్పుడు కూడా. అంటే మీ 4G ఫోనులో My Jio యాప్ ఇంస్టాల్ చేసుకొని, కోడ్ generate చేసి, కోడ్ మరియు ఆధర్ కార్డ్(ఒరిజినల్ అండ్ జెరాక్స్) అండ్ రెండు ఫోటోస్ పట్టుకొని దగ్గరిలోని Jio కు సంబంధించిన ఏ స్టోర్ కు వెళ్ళినా 30 నిమిషాల్లో మీకు సిమ్ ఇస్తారు.
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ లో ఇంటర్నెట్ లిమిట్ విషయం ఏంటి?
welcome offer లో రోజుకి 4GB లిమిట్ ఉండగా ఇప్పుడు HPY ఆఫర్ లో రోజుకు కేవలం 1GB లిమిట్ ఇస్తుంది. రోజుకు 1GB డేటా దాటితే, స్పీడ్ 128Kbps కు పడిపోతుంది.
ఎందుకు ఇలా 1GB లిమిట్ పెట్టింది Jio?
కంపెని లెక్కలు ప్రకారం 80% మంది Jio లో రోజుకు 1GB వాడుతున్నారు, మిగిలిన 20% మంది అంతకు మించి వాడుతున్నారు. సో ఈ తక్కువ శాతం మంది వాడె విపరీతమైన డేటా వలన ఎక్కువ శాతం(80%) మంది ఇంటర్నెట్ లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సో ఇప్పుడు అందరికీ సమానంగా డేటా షేర్ అవుతుంది అని తెలిపింది కంపెని.
1GB దాటితే స్పీడ్ తగ్గకుండా ఉండేందుకు ఏమైనా చేసుకోగలమా?
చేసుకోగలరు, కాని ఇది మీకు నచ్చదు. ఎందుకంటే ఇది recharge మెథడ్. మీరు హ్యాపీ న్యూ ఆఫర్ లో ఉండగా Jio యొక్క paid సర్వీసెస్ ను రీచార్జ్ చేసుకొని వాడగలరు. సో అలా ఇంటర్నెట్ ఆఫర్ ను రీచార్జ్ చేసుకొని స్పీడ్ తగ్గకుండా చేసుకోగలరు.
ఏంటి ఆ paid రీచార్జ్ ప్లాన్స్?
పైన మొదటి జవాబులో ఫ్రీ యాప్స్ సర్వీసెస్ అని అన్నారు కదా, ఏమిటి ఆ యాప్స్?
• JioTV (Live TV, Catch up TV)
• JioCinema (Movies, Video on Demand)
• JioMusic (Music)
• JioMags (Magazine)
• JioNews (Newspaper)
• JioXpressNews (Newsfeed)
• JioCloud (Cloud) – 5 GB
• JioSecurity (Device Manager)
ఒకే ఫోన్ పై Welcome ఆఫర్ కు మరియు happy new year offer కు వేరు వేరు సిమ్స్ తీసుకొని వాడుకోవచ్చా?
వాడుకోవటానికి కంపెని అనుమతి ఇవ్వదు. అవసరం కూడా లేదు. పైన చెప్పినట్లు వెల్కమ్ ఆఫర్ ముగిసిన అర్థరాత్రే మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఆటోమాటిక్ గా upgrade అయిపోతుంది ఎటువంటి manual పనులు చేయకుండా.
గమనిక: దయచేసి ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్ లో మరియు ఫేస్ బుక్ కామెంట్స్ లో తెలియజేయగలరు.
గతంలో రిలయన్స్ Jio పై వ్రాసిన స్టోరీస్ ను క్రింద చూడగలరు. వాటిపై క్లిక్ చేస్తే ఆర్టికల్స్ ఓపెన్ అవుతాయి. ముందుగా ఈ లింక్ లో లేటెస్ట్ గా వ్రాసిన 1 రూపీ కన్నా తక్కువకి వస్తున్న Jio బ్రాడ్ బ్యాండ్ వివరాలు చూడగలరు
1. Unlimited ఇంటర్నెట్ అండ్ కాలింగ్ కలిగిన రిలయన్స్ Jio SIM కంప్లీట్ ఇన్ఫర్మేషన్
2. welcome offer complete questions and answers
3. రిలయన్స్ Jio లోని Welcome offer, మార్చ్ 2017 వరకూ పనిచేస్తుంది అనే వార్త ఎలా వచ్చింది?
4. welcome ఆఫర్ ముందుగా తెలిపిన డేట్ కన్నా ముందే ముగిసిపోతుంది.
5. వాట్స్ అప్ & సోషల్ నెట్ వర్కింగ్ లో Jio పై రన్ అయిన రూమర్స్ లోని నిజాలు
6. Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా (tested)
7. Jio సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోగలరు ఈ లింక్ లో తెలిపినట్లు చేస్తే