రిలయన్స్ JIO: యాక్టివేషన్ కు లంచాలు, 1977 కనెక్ట్ కాకపోవటం, కాల్స్ ఏమీ వెళ్లకపోవటం - టోటల్ problems

బై PJ Hari | పబ్లిష్ చేయబడింది 23 Sep 2016
రిలయన్స్ JIO:  యాక్టివేషన్ కు లంచాలు, 1977 కనెక్ట్ కాకపోవటం, కాల్స్ ఏమీ వెళ్లకపోవటం - టోటల్ problems

రిలయన్స్ Jio టెలికాం సెక్టార్ లో ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. డబ్బు అనే కాన్సెప్ట్ ను కనుగొన్న తరువాత free గా ఇవ్వటం అనే కాన్సెప్ట్ లోనే యూనివర్సల్ ఆమోదం ఉంటుంది. సో మొన్న రిలయన్స్ నిన్న BSNL (అవును BSNL కూడా free కాల్స్ తో వస్తుంది. కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో చూడగలరు)...ఇక రేపు కూడా ఎవరైనా free అంటే గంతులేయటం కామనే. 

అసలు పైసా కూడా కట్టనవసరం లేకుండా జీవిత కాలం కాల్స్ ఫ్రీ అంటే కస్టమర్స్ అందరూ కచ్చితంగా Jio కు బ్రహ్మరథం పట్టేవారు. పట్టారు కూడా కాని సిమ్ తీసుకోవటానికి చేసే కోడ్ ప్రోసెస్ నుండి కాల్ కనెక్టింగ్ వరకూ విపరీతమైన గందరగోళం కారణంగా ముకేష్ అంబానీ Jio రివల్యుషనరీ ఆఫర్స్ ను అనౌన్స్ చేసిన నెల రోజుల లోపే రిలయన్స్ రోజు రోజుకూ తన క్రెడిట్ ను తానే నాశనం చేసుకుంటుంది.

కాని నిజంగా ముకేష్ అంబానీ చెప్పిన ప్రామిసెస్ రన్ అవుతున్నాయా?

1. కోడ్ జెనరేటింగ్ అనే పద్దతి ఎవరి కోసం అసలు? అన్ని 4G ఫోనులకు Jio పనిచేస్తుంది అన్నప్పుడు మరలా కొన్ని ఫోనులకు కోడ్ జెనరేటింగ్ పెట్టటం... మరొ వైపు ఇప్పటికీ సెపరేట్ గా కొన్ని బ్రాండ్స్ తో Jio సపోట్ అంటూ పార్టనర్ షిప్ చేయటం అనేది పాయింట్ లెస్ గా ఉంది. Jio సిమ్ తీసుకోవటానికి ప్రాసెస్.. కోడ్ జెనరేటింగ్ వద్దనే మొదలవుతుంది. కాని ఆదిలోనే సూపర్ ఫ్లాప్. ఒక వేల కంపెని కావాలనే ఫ్లోటింగ్ ను తట్టుకొవటానికి కోడ్స్, స్టాక్స్ వంటి ఇష్యూస్ ను పైకి తెస్తే దానికి అంటూ ఒక పద్దతి చూడాలి కాని ఇలా చేయటం sensible గా లేదు 

2. రెండవ స్టెప్ కోడ్ పట్టుకొని సిమ్ తీసుకోవటానికి స్టోర్ కు వెళ్ళటం. కాని వెళితే సిమ్స్ కొరత. ఎంత free గా ఇస్తే మాత్రం కస్టమర్స్ ను ఇన్ని విధాలుగా ఇన్ని సార్లు స్టోర్ లకు తిప్పించుకోవటం సమంజసం కాదు. Free కాల్స్ మరియు Unlimited ఇంటర్నెట్ అనే రివల్యుషనరీ ఆఫర్స్ ప్రజలకు మొట్టమొదటిసారిగా ప్రాక్టికల్ లాంచ్ చేసేంత ప్రణాళికలు ఉన్నాయి కాని ఇలాంటి ప్లాన్స్ ను ప్రవేశపెడితే ఎన్ని లక్షల - కోట్ల అప్లికేషన్స్ వస్తాయో తెలియదా రిలయన్స్ కు? కొన్ని స్టోర్స్ లో సిమ్ కు డబ్బులు కూడా అడుగుతున్నారు. రూ 200 నుండి 1000 రూ కూడా ఉంది Jio సిమ్ కు రేట్. కానీ కంపెని మాత్రం అఫీషియల్ గా ఫ్రీ గా ఇస్తుంది సిమ్ ను.

3. 15 నిమిషాల e-KYC రిజిస్ట్రేషన్స్ అన్నారు. కాని ఏ స్టోర్ లో ఏ పద్దతిలో ఏ ప్రూఫ్ అడుగుతున్నారో అటు రిలియన్స్ సిబ్బందికే క్లారిటీ లేకపోవటం అనేది కస్టమర్స్ ను బాగా ఇబ్బందులకు గురి చేస్తుంది. కొందరు IMEI నంబర్ అడుగుతున్నారు దేనికి సర్ అని అడుగుతున్నారు నన్ను. అది అలా IMEI అడిగే వారికే తెలియనప్పుడు ఇక ఎవ్వరికీ తెలియదు. బహుశా కంపెని చెప్పకపోయినా, సొంత తెలివితేటలతో ఉపయోగించి.. కస్టమర్స్ ఎవరూ సెకెండ్ సిమ్ తీసుకోకుండా IMEI నంబర్ అడుగుతున్నరేమో. ఇదొక్కటే కాదు, Jio కు సంబంధించి చాలా ప్రశ్నలకు జవాబులు లేవు. 

4. నెక్స్ట్ యాక్టివేషన్ ప్రాబ్లెం. సిమ్ చేతిలోనే ఉంటుంది రోజుల తరబడి. కొందరు తీసుకోని నెల రోజులు అవుతుంది. కాని యాక్టివేషన్ మెసేజ్ కోసం రోజూ పడిగాపులు. ఫోన్ లో ఏ మెసేజ్ వచ్చినా అది Jio యాక్టివేషన్ మెసేజ్ ఏమో అని ఆశ. ఆఖరికి  ఎలాగోలా సిమ్ యాక్టివేట్ అయ్యిందని ఎన్నో hopes తో సిమ్ ఫోన్ లో వేస్తే దానిని 1977 కనెక్ట్ చేసుకునే విషయంలో కూడా చాలా కన్ఫ్యూషన్స్ అండ్ ప్రాబ్లెమ్స్. కనీసం అనుభవంతో కస్టమర్స్ చెబుతున్నప్పుడైనా... వాటికి సోలుషన్స్ అందించి స్టోర్స్ లో కాని ఇతర కంపెని సైట్స్ లో కాని అందరికీ తెలియజేసే ప్రయత్నాలు చేయాలి Jio ఇప్పటికైనా.

సిమ్ ఇచ్చే వారికి కూడా ప్రాబ్లెమ్స్ ఏమున్నాయో తెలియకపోవటం Jio ప్రారంభం అయిన కొత్తలో అయితే ఫర్వాలేదు అనుకోవచ్చు కాని ఇప్పటికీ స్టోర్ సిబ్బందిని "ఎందుకు కొన్ని ఫోన్లలో కోడ్ generate అవటం లేదు" అనే పాయింట్ ను అడిగితే అటు రిలయన్స్ పబ్లిక్ రిలేషన్స్ persons, ఇటు కస్టమర్ కేర్ సిబ్బంది లేదా స్టోర్స్ లో ఉండే సిబ్బంది సమాధానాలు చెప్పలేకపోవటం పూర్తి వైఫల్యం అని చెప్పాలి.

5. సరే ఫైనల్ గా 1977 కాల్స్ అండ్ ఇంటర్నెట్ యాక్టివేషన్ కూడా అయ్యింది. నానా తంటాలు పడి, సిమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ యాక్టివేషన్ చేస్తే, టెలికాం రంగంలోనే మెజారిటీ users కలిగిన ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా నెట్ వర్క్స్ నంబర్స్ కు కాల్స్ వెళ్ళటం లేదు అస్సలు. 30 నుండి 50 సార్లు రీడైల్ చేస్తేనే కాని కాల్స్ వెళ్ళవు వారికి. కారణం ఇంటర్ కనెక్టింగ్ ప్రాబ్లెమ్స్! 

అసలే ఇండియా జనాబా ఎక్కువ. ఆ జనాబా వలనే రిలయన్స్ బిజినెస్ కూడా జరుగుతుంది ఒక విధంగా. దానికి తోడూ free కాల్స్. సో ఇప్పుడు టెక్నికల్ గా ఎలాంటి కొత్త చాలేంజేస్ వస్తాయి, ఎన్ని అధిక రెట్లు పోర్ట్స్ అవసరం వస్తుంది ఇతర నెట్ వర్క్స్ తో అనే విషయాలను కూడా కంపెని ఊహించలేదా?

టోటల్ ప్రోసెస్ లోని ఇబ్బందులకు సంబంధించి కస్టమర్స్ కు దగ్గరిగా ఉండే స్టోర్ సిబ్బంది అయినా లేక కంపెని అయినా సోలుషన్స్ తో ముందుకు వస్తారేమో అని వెయిట్ చేయటం జరిగింది ఇన్ని రోజులూ. కాని ఎక్కడా అటువంటి ఆనవాళ్ళు కనిపించటం లేదు. సో ఇదంతా చూస్తుంటే "ఎర వేసి చేపను పట్టుకొని దానిని విలవిల కొట్టుకునేలా చేసినట్లు ఉంది" రిలయన్స్ వ్యవహారం.

అయితే ఏ కంపెని ఇలాంటి నినాదాలతో పనిచేయదు అని పర్సనల్ గా నమ్మే వ్యక్తిని. కాని  ప్రశ్న ఏంటంటే ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్ ను కస్టమర్స్ కు అందిస్తున్నప్పుడు, ఎంత భారి సంఖ్యలో అప్లికేషన్స్ వస్తాయి, ఎన్ని సిమ్స్ ఉండాలి, కోడ్ జెనరేటింగ్ అనేది ఎందుకు, అందరికీ పనిచేస్తుందా, దేశ వ్యాప్తంగా స్టోర్స్ లో సరైన సమాచారం ఉందా, సరైన సమాచారం కాకపోయినా ఒక యూనివర్సల్ కామన్ ఇన్ఫర్మేషన్ ఉందా అనే బేసిక్ విషయాలను కూడా విశ్లేషణ చేసుకోవటానికి కూడా కంపెని సముఖుత చూపటం లేదు.

రిలియన్స్ అందరికీ ఇండియన్ టెలికాం లో ఫ్రీ పద్దతలను ప్రవేశ పెడదామని అనుకుంది. అది మంచిదే కాని మన దేశ జనాబా ను దృష్టిలో ఉంచుకొని అటు ఇతర నెట్ వర్క్స్ తో ఎదురైయ్యే టెక్నికల్ ఛాలెంజ్స్ కు ప్రత్యామ్నాయాలతో ఉండి ఇటు కస్టమర్స్ తో యాక్టివేషన్ ప్రోసెస్ ను ఒక పద్దతిలో దశల వారిగా చేపట్టే ప్రయత్నాలను చేసుండాలి అనేది నాకే కాదు అందరికీ అనిపిస్తున్న భావన.  తొందరిలోనే వీటిని సాల్వ్ చేయకపొతే, ఇతర నెట్ వర్క్స్ కూడా FREE కాల్స్ వంటి ఆఫర్స్ తో ముందుకు వస్తారు. అప్పటికి రిలయన్స్ మరలా ఫేడ్ అయ్యే అవకాశాలుంటాయి.

కస్టమర్స్ ఇబ్బందులకు ప్రియారిటీ చేసుకొని respond అయ్యే కంపెనీలకు ఎప్పుడూ కాలం చెల్లదు. కాని "ఇచ్చాము కదా సర్వీస్/ఆఫర్ అదే ఎక్కువ" అనే భావన కలిగితే అది ఆటోమాటిక్At గా కస్టమర్స్ ను పరోక్షంగా దూరం చేసుకున్నట్లే.

logo
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status