డిజిట్ తెలుగు సైట్ ను వాడేటప్పుడు బ్రౌజర్ లో యాడ్స్ టాపింగ్ ప్రాబ్లెం నుండి బయట పడండి ఇలా

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 01 Aug 2016
డిజిట్ తెలుగు సైట్ ను వాడేటప్పుడు బ్రౌజర్ లో యాడ్స్ టాపింగ్ ప్రాబ్లెం నుండి బయట పడండి ఇలా

మీరు డిజిట్ వెబ్ సైట్ మాత్రమనే కాకుండా ఇతర వెబ్ సైట్స్ ను చూడటనికి ఫోన్ లో chrome బ్రౌజర్ యాప్ వాడుతుంటారా? అయితే ఇది మీ కోసం వ్రాసే ఆర్టికల్.

జనరల్ గా సైట్ ఏదైనా బ్రౌజ్ చేస్తుంటే, సైట్ లో ఉండే యాడ్స్ అవి ఉండటం, అనుకోకుండా వాటిపై క్లిక్ చేయటం జరుగుతుంది. ఇది సహజంగా ఇంటర్నెట్ స్పిడ్స్ తక్కువుగా ఉన్న వారికీ జరుగుతుంది.

పూర్తిగా సైట్ load అయ్యే లోపు మనకు కావలసిన దానిపై టాప్ చేసే సరికి సడెన్ గా అదే ప్లేస్ లో యాడ్ రావటం, అప్పుడు మనకు కావలసిన దానికి బదులు యాడ్ ఓపెన్ అవటం వంటివి చిరాకు తెప్పిస్తాయి.

సో దీనికి సొల్యూషన్ గా మీరు chrome url బార్ లో chrome://flags/#enable-scroll-anchoring అనే ఈ text ను కాపీ చేసి పేస్టు చేయండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు chrome యొక్క డెవెలపర్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి.

ఇక్కడ Scroll Anchoring అనే ఆప్షన్ క్రింద default అని ఉంటుంది. దానిని enable చేయండి. ఇక నుండి యాడ్స్ అనే కాదు ఒక దానికి బదులు వేరే లింక్ పై టాప్ చేసే అవకాశాలు రావు.

జనరల్ గా chrome://flags అని కాపీ పేస్టు చేసి చూస్తె క్రోమ్ డెవలపర్ సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తాయి.

logo
Team Digit

All of us are better than one of us.

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status