51 రూ లకు 1GB 4G డేటా ఆఫర్స్ ను ప్రవేసపెట్టిన ఎయిర్టెల్ ప్రీపెయిడ్

బై PJ Hari | పబ్లిష్ చేయబడింది 29 Aug 2016
51 రూ లకు 1GB 4G డేటా ఆఫర్స్ ను ప్రవేసపెట్టిన ఎయిర్టెల్ ప్రీపెయిడ్

Airtel లో కొత్త ఇంటర్నెట్ ఆఫర్స్ వచ్చాయి ప్రీపెయిడ్ users కు.కొత్తగా కనెక్షన్ తీసుకున్నా, ఆల్రెడీ కనెక్షన్ ఉన్నా పనిచేస్తుంది.  కంపెని Jio కు పోటీగా ఏదో ఒకటి లాంచ్ చేయాలనీ రోజుకు కనీసం ఒక చేంజ్ అయినా చేస్తుంది.

కొత్త ఆఫర్స్ గురించి చూద్దాం రండి....

టోటల్ రెండు ఆఫర్స్. ఇవి వినటానికి చాలా attractive గా ఉండే టట్లు గా ప్లాన్ చేసింది ఎయిర్టెల్. ఎందుకు ఇలా అంటున్నానో మీరే చూడండి...

వీటి పేరులు Mega Saver Packs. మొదటి ఆఫర్ - 748 rs పెట్టి రీచార్జ్ చేస్తే 1GB 4G/3G డేటా వస్తుంది. దీనికి తోడూ.... నెలకు 99 రూ రీచార్జ్ చేస్తే చాలు 1GB 4G/3G ఇంటర్నెట్ పొందలగలరు. ఇలా 6 నెలలు ఎన్ని 1GB రిచార్జేస్ అయినా చేసుకోగలరు. అంటే నెలకు 125 rs రెంటల్ ప్లస్ 99 rs. టోటల్ 224 rs అవుతుంది 1GB డేటా కు. ఇదే నార్మల్ గా చేసుకుంటే 1GB డేటా కు 265 రూ ఖర్చు అవుతుంది. సో తేడా చిన్నగానే(సుమారు 40 rs ఉంది) ఉంది. Jio కు దరిదాపుల్లో కూడా లేదు. కాని కంపెని 51 రూ లకే 1GB 4G అని యాడ్స్ ఇచ్చుకునేలా డిజైన్ చేసింది ప్లాన్ ను. 

రెండవది... 1,498 rs పెట్టి recharge చేసుకుంటే 1GB 4G డేటా ఇస్తుంది. అదనంగా 12 నెలలు పాటు, 1GB 4G/3G డేటా 51 రూలకే వస్తుంది. దీనికి 28 రోజుల validity ఉంటుంది. అయితే డైరెక్ట్ గా 51 recharge చేస్తే పనిచేయదు, పైన ఉన్న ఆఫర్ లానే ముందు 1498 rs రెంటల్ రీచార్జ్ చేయాలి. 12 నెలలో  ఎన్ని సార్లు అయినా 1GB రీచార్జ్ లు చేసుకోగలరు. ఇంకా 2GB డేటా కొరకు 99 రీచార్జ్ చేస్తే చాలు. 5GB డేటా కు 259 rs.

అదే ప్రస్తుతం ఈ ఆఫర్స్ తో పనిలేకుండా, నార్మల్ గా అయితే 1GB 4G/3G డేటా కు 28 రోజుల validity తో 265 రూ పెట్టి రీచార్జ్ చేయాలి, 2GB కు 455rs రీచార్జ్ చేయాలి,  5GB కు 655 రూ రీచార్జ్ చేయాలి.

కాని ఇంటర్నెట్ ను ఎక్కువుగా వాడే వారు దీనిని waste ఆఫర్ అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే for eg: మీరు నెలకు 10GB వాడుతారు అనుకుందాము. సో ఒక నెలకు 51*10= 510 + 125 (రెంటల్) = 635 rs అవుతుంది 10GB 4G డేటా కు. మొదటి నెలలో ఆల్రెడీ 1GB డేటా ఇస్తుంది కాబట్టి 635 - 51 = 584 rs అవుతుంది. అంటే మిగిలిన 11 నెలలకు 635 అవుతుంది. ఇదే 10GB కు నార్మల్ గా అయితే 999 rs కు అవుతుంది 28 రోజులకు. ఈ ఆఫర్ లో కొద్ది పాటి సేవింగ్ అనే కాకుండా మీకు ఎప్పడు డేటా అయిపోతే అప్పుడు రీచార్జ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది అని గమనించగలరు. 

ఫైనల్ లైన్ ఏంటంటే...మీరు ఇంటర్నెట్ ను ఎక్కువుగా వాడితే ఇది మనీ saver అని చెప్పాలి. కాని ఒకవేళ ఎయిర్టెల్ కంపెని, Jio కు పోటీ ఇచ్చే ప్రయత్నం గా ఈ ఆఫర్స్ ను లాంచ్ చేసి ఉంటే ఇది సక్సెస్ కానట్లే అని చెప్పాలి. ఎందుకంటే Jio సింపుల్ గా స్ట్రైట్ గా ఫ్రీ గా ఇస్తుంది. ఎయిర్టెల్ ఫ్రీ గా ఇవటం లేదు కదా చాలా ట్విస్ట్ లు పెట్టి ఇస్తుంది.

స్టోరీ మీకు అర్థమయ్యేలా వ్రాసాను అనుకుంటున్నాను. దీనిపై fb లో మీ కామెంట్స్ తెలియజేయగలరు. నా ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు, ఈ లింక్ పై క్లిక్ చేయగలరు. 

ఈ క్రింద వీడియో లో ఎయిర్టెల్ మరియు vodafone 4G speeds ను కంపేర్ చేసి తెలుగులో ఒక వీడియో చేయటం జరిగింది. చూడగలరు..

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status