UPI అంటే ఏమిటి? ఎందుకు ఇది? ఎలా పనిచేస్తుంది? కంప్లీట్ డిటేల్స్

బై PJ Hari | పబ్లిష్ చేయబడింది 02 Jan 2017
UPI అంటే ఏమిటి? ఎందుకు ఇది? ఎలా పనిచేస్తుంది? కంప్లీట్ డిటేల్స్

UPI అంటే?  (Unified Payments Interface)
బ్యాంక్ ఖాతా యొక్క నెట్ బ్యాంకింగ్, IFSC కోడ్స్, wallets డిటేల్స్ లేదా atm కార్డ్ డిటేల్స్ ఎంటర్ చేయకుండా offline మరియు online లో అవసరాలకు డబ్బులు trasfer చేయటం మరియు పేమెంట్స్ చేసే సిస్టం. అవును UPI అనేది సిస్టం, అప్లికేషన్ కాదు. కాని మీ బ్యాంక్ తో అనుసంధానం అయ్యి సెపరేట్ యాప్ లో వస్తుంది ఈ సిస్టం. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన సిస్టం. రెండు బ్యాంక్స్ మధ్య మనీ ట్రాన్స్ఫర్ కూడా చేసే ఇది ప్రతీ బ్యాంక్ కు ఉంటుంది.

ఎన్ని బ్యాంక్స్ కు ఈ సిస్టం ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది?
ఆర్టికల్ వ్రాస్తున్నప్పటికి UPI సిస్టం ను సపోర్ట్ చేస్తున్న బ్యాంకులు.. SBI, Andhra Bank, Axis Bank, Bank of Maharashtra, Bhartiya Mahila Bank, Canara Bank, Catholic Syrian Bank, DCB Bank, Federal Bank, ICICI Bank, TJSB Sahakari Bank, Oriental Bank of Commerce, Karnataka Bank, UCO Bank, Union Bank of India, United Bank of India, Punjab National Bank, South Indian Bank, Vijaya Bank and YES Bank. 

మా బ్యాంక్స్ లో ఎలా వినియోగించుకోవాలి UPI సిస్టం ను?
ముందుగా ప్లే స్టోర్ లో మీ బ్యాంక్ పేరు మరియు "UPI" అని ఎంటర్ చేసి సర్చ్ చేయండి ఇప్పుడు మీకు మీ బ్యాంకు upi అప్లికేషన్ వస్తుంది. SBI కు మాత్రం SBI pay అని ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేయబోయే యాప్ సరైనదా కాదా తెలుసుకోవటానికి యాప్ డెవలపర్ పేరు చూడండి, బ్యాంక్ పేరు ఉండాలి డెవలపర్ పేరు లో. 

యాప్ ఇంస్టాల్ చేసిన తరువాత ఏమి చేయాలి?
ఓపెన్ చేస్తే మీ ఫోన్ ను స్కాన్ చేసి, మీ ఫోన్ నుండి పర్టికులర్ బ్యాంక్ కు SMS పంపిస్తుంది. అయితే మీరు బ్యాంక్ అకౌంట్ కు అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్ నుండే మీరు ఈ ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే ఆటోమాటిక్ యాప్ SMS పంపుతుంది. సో పంపిన తరువాత కరెక్ట్ అయితే మీకు పేరు, బ్యాంక్ పేరు వంటి కొన్ని డిటేల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది.  ఇప్పటి వరకూ ఇది అంతా ఒకేసారి జరగకపోవచ్చు. సర్వర్స్ కారణం మీరు రిపీట్ చేయావలసిన సందర్భాలు రావచ్చు. సక్సెస్ అయ్యే వరకూ చేస్తే మీకు వెంటనే పాస్ వర్డ్ సెట్ చేయమని అడుగుతుంది. అంతే! అంతా అయిపొయింది. ఇక మీరు అమౌంట్ పేమెంట్, transfer వంటి పనులకు ప్రతీ సారి బ్యాంక్ అకౌంట్ డిటేల్స్ ను వాడకుండానే పేమెంట్స్ చేసుకోవచ్చు.
మైనస్ పాయింట్స్: SBI UPI యాప్ స్లో గా ఉంది. మిగిలిన బ్యాంక్స్ UPI యాప్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియదు మరి. బేసిక్ గా  సర్వర్స్ తో కనెక్ట్ అవటం వలన స్లో గా ఉంటుంది.

అసలు ఆల్రెడీ ఉన్న wallets కు UPI సిస్టం కు డిఫరెన్స్ ఏంటి?

  • మీ బ్యాంక్ డిటేల్స్ అన్నీ ఒక ఈమెయిలు ఐడి మాదిరి బ్యాంక్ అడ్రెస్ కు లింక్ అయ్యి ఉంటాయి. దీనినే VPN అని అంటారు. Virtual Payment Address. సో ఇక దీనితో అన్ని బ్యాంక్ పనులు చేసుకోగలరు cashless గా.
  • wallet యాప్ వలె బ్యాంక్ నుండి అమౌంట్ ను ప్రత్యేకంగా యాడ్ చేసుకోవటం, లిమిట్స్ వంటి అవసరాలు ఉండవు.
  • UPI అనేది డైరెక్ట్ బ్యాంక్ to బ్యాంకు secure లావాదేవీలు. మధ్య వర్తులు ఎవరూ ఉండరు.
  • ఏ బ్యాంక్ UPI నుండి అయినా ఏ బ్యాంక్ UPI కు అయినా అమౌంట్ transfer చేయవచ్చు. IMPS కు advanced సిస్టం. అవతల వ్యక్తికి పంపిన అమౌంట్ ను జనరల్ కాష్ లానే వాడుకోగలరు.
  • UPI అడ్రెస్ - VPA ఉంటే చాలు ఎవరికైనా అమౌంట్ transfer చేయవచ్చు. వెంటనే పడిపోతాయి. ఇవేమీ wallets లో లేవు. ఉన్నా మరింత ప్రోసెస్ అవసరం తో వస్తాయి.

మీ సందేహాలన్నీ తీరుతాయి అని ఆశిస్తున్నా. ఆర్టికల్ పై మీ కామెంట్స్ తెలియజేయగలరు. 

logo
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status