OnePlus 2 ఇండియా లో లాంచ్ అయ్యింది

OnePlus 2 ఇండియా లో లాంచ్ అయ్యింది
HIGHLIGHTS

4gb, 3GB వేరియంట్స్ లో వస్తుంది

మోస్ట్ రివల్యుషనరీ మోడల్ OnePlus one గత సంవత్సరం  లాంచ్ అయ్యింది. చైనీస్ మార్కెట్ నుండి విడుదల అయినా దాని వెనుక స్మార్ట్ ఫోన్ యూజర్స్ అందరూ వెంటపడి మరీ కొనటం జరిగింది. దానికి కారణం హై ఎండ్ స్పెక్స్ ను బడ్జెట్ ధరలో లాంచ్ చేయటమే. ఇప్పుడు వన్ ప్లస్ బ్రాండ్ రెండవ మోడల్ లాంచ్ చేసింది ఈ రోజు.  OnePlus 2 64 GB ధర 24,999 రూ. 16GB వేరియంట్ ప్రైస్ ఇంకా అనౌన్స్ అవలేదు.

 

OnePlus 2 స్పెసిఫికేషన్స్ – స్నాప్ డ్రాగన్ 810 1.8GHz SoC v2.1. అడ్రెనో 430 GPU , 4GB LPDDR4 ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, usb type – c పోర్ట్ (డేటా ట్రాన్సఫర్ మరియు చార్జింగ్), 5.5 in IPS LCD in-cell డిస్ప్లే, 3300 mah బ్యాటరీ, డ్యూయల్ సిమ్(nano), 4G, 64gb ఇంబిల్ట్ స్టోరేజ్.

OnePlus 2 లో ఇంప్రెస్ చేసే పాయింట్స్

1. Aluminum – మాగ్నిసియం alloy ఫ్రేం మరియు జ్యువెలరీ – గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టిల్ vibrant లుక్స్. 
2. 5.5 in IPS LCD In – cell డిస్ప్లే. డైరెక్ట్ సన్ లైట్ లో OnePlus 2 ,178 డిగ్రీల క్రిస్టల్ క్లియర్ వ్యూయింగ్ యాంగిల్స్ చూపిస్తుంది.
3.సాలిడ్ మరియు durable బిల్డ్ క్వాలిటీ కేవలం 175 గ్రా బరువు తో ఉంది ఫోన్. చాలా natural గా ఉంది ఫోన్ hold చేసేటప్పుడు.
4.3300 mah బ్యాటరీ వన్ డే ఫుల్ బ్యాక్ అప్
5. 64 బిట్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 810 SoC ప్రస్తుత మార్కెట్ లోని fastest ప్రొసెసర్.
6. 64 gb ఇంబిల్ట్ స్టోరేజ్ మరియు eMMC 5.0 ఫ్లాష్ మెమరీ, 4GB LPDDR4 ర్యామ్

7. 13MP 6 ఫిజికల్ లెన్స్ పవర్ ఫుల్ డ్యూయల్ LED ఫ్లాష్, f/2.0 aperture తో extraordinary డిజిటల్ ఫోటోగ్రఫీ పవర్ దీనిలో ఉంది. మోస్ట్ ఇంప్రెసివ్ పాయింట్ 1.3 µm లైట్ కలేక్టింగ్ పిక్సెల్స్ ఉన్న లార్జ్ సెన్సార్. ఇది మీరు ఎప్పుడూ చూడనటువంటి లో లైట్ ఫోటోలను తీస్తుంది. 0.33 మిల్లి సెకెన్లలో ఫోకస్ షార్ప్ నెస్.
8. వైడ్ యాంగిల్ 5MP కెమేరా లో ప్రతీ యాంగిల్ కవర్ అవుతుంది. బెస్ట్ సేల్ఫీ ఎక్స్పీరియన్స్.
9. అసలైన వుడ్ బాంబూ, బ్లాక్ apricot, రోజ్ వుడ్ మరియు Kevlar బ్యాక్ ప్యానల్స్ తో వస్తుంది.

అమెజాన్ లో exclusive గా 64 gb మోడల్ ఆగస్ట్ 11 న invite తో సేల్ అవనుంది. 16 gb వేరియంట్ 3GB LPPDR4 ర్యామ్ ఈ సంవత్సరం చివరిలో మార్కెట్ లోకి వస్తుంది.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo