Honor X9c 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన హానర్.!

HIGHLIGHTS

Honor X9c 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ఈరోజు హానర్ కన్ఫర్మ్ చేసింది

ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు హానర్ ఈ ఫోన్ గురించి గొప్పగా టీజింగ్ చేస్తోంది

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుంది

Honor X9c 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన హానర్.!

Honor X9c 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ఈరోజు హానర్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను డ్రాప్, హాట్ మరియు వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో పాటు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు హానర్ ఈ ఫోన్ గురించి గొప్పగా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Honor X9c 5G : లాంచ్ డేట్

హానర్ ఎక్స్9c స్మార్ట్ ఫోన్ ను జూలై 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా లాంచ్ అవుతుంది మరియు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుంది.

Honor X9c 5G : ఫీచర్లు

ఈ హానర్ స్మార్ట్ ఫోన్ స్లిమ్ టైటానియం డిజైన్ తో కేవలం 7.98mm మందంతో స్లిమ్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో 6600 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 66W ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఇండస్ట్రీ లీడింగ్ 2 మీటర్ డ్రాప్ అల్ట్రా టఫ్ డిజైన్ తో ఉంటుంది. అంతేగాదు, IP65M రేటెడ్ 360 డిగ్రీల వాటర్ రెసిస్టెంట్ తో మరింత ఆకట్టుకుంటుంది.

Honor 9Xc 5G

ఈ ఫోన్ 1.5 రిజల్యూషన్ కలిగిన క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు DCI P3 సినిమాటిక్ వైడ్ కలర్ గాముట్ తో వస్తుంది. ఈ ఫోన్ 108MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.

Also Read: విలక్షణమైన డిజైన్ తో విడుదలైన Nothing Headphone 1 ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్ట్ తో వస్తుంది. ఇది 3x లాస్ లెస్ జూమ్ మరియు 9 ఇన్ వన్ పిక్సెల్ ఫీచర్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ కూడా అందించింది.

ఈ ఫోన్ మ్యాజిక్ OS 9.0 తో నడుస్తుంది. ఇందులో 300% గొప్ప సౌండ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo