Lava Storm Play 5G: 10 వేల బడ్జెట్ లో LPDDR5 RAM తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

లావా స్మార్ట్ సిరీస్ నుంచి ఈరోజు రెండు కొత్త ఫోన్ లను విడుదల చేసింది

లావా స్టార్మ్ ప్లే 5జి స్మార్ట్ ఫోన్ ను 10 వేల బడ్జెట్ లో LPDDR5 RAM తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7060 చిప్ సెట్ తో విడుదలైన మొదటి ఫోన్ గా కూడా నిలిచింది

Lava Storm Play 5G: 10 వేల బడ్జెట్ లో LPDDR5 RAM తో లాంచ్ అయ్యింది.!

Lava Storm Play 5G: లావా స్టోర్మ్ సిరీస్ నుంచి ఈరోజు రెండు కొత్త ఫోన్ లను విడుదల చేసింది. వీటిలో లావా స్టార్మ్ ప్లే 5జి స్మార్ట్ ఫోన్ ను 10 వేల బడ్జెట్ లో LPDDR5 RAM తో లాంచ్ చేసింది. ఇది మాత్రమే కాదు మీడియాటెక్ Dimensity 7060 చిప్ సెట్ తో విడుదలైన మొదటి ఫోన్ గా కూడా నిలిచింది. లావా సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Storm Play 5G: ప్రైస్

లావా స్టార్మ్ ప్లే 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఆఫర్ ధరలు లిమిటెడ్ స్టాక్ పై మాత్రమే వర్తిస్తాయి, అని లావా తెలిపింది. జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Lava Storm Play 5G: ఫీచర్స్

లావా స్టార్మ్ ప్లే స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 7060 5జి చిప్ సెట్ తో విడుదలైన మొదటి ఫోన్ గా నిలిచింది. ఈ చిప్ సెట్ 5 లక్షలకు పైగా AnTuTu స్కోర్ అందిస్తుంది మరియు మంచి పెర్ఫార్మన్స్ అందిస్తుందని లావా తెలిపింది. ఈ చిప్ సెట్ కి జతగా 6GB LPDDR5 RAM (ఫిజికల్), 6GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB (UFS 3.1) ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.75 ఇంచ్ డిస్ప్లే అందించింది మరియు ఈ డిస్ప్లే HD ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది.

Lava Storm Play 5G

ఈ లావా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా అందించింది. ఇందులో 50MP Sony IMX 752 ప్రధాన కెమెరా ఉంటుంది మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. లావా ఈ ఫోన్ ను 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ ను బ్లోట్ వేర్ లేకుండా క్లీన్ ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ చేసింది.

Also Read: Oppo K13x 5G: డామేజ్ ప్రూఫ్ ఆర్మోర్ బాడీ తో లాంచ్ అవుతుంది.!

ఈ ఫోన్ డిజైన్ పరంగా, చాలా స్లీక్ మరియు అందమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ప్రీమియం గ్లాస్ బ్యాక్ సెటప్ అందించింది. ఈ ఫోన్ లో ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించింది. ఈ ఫోన్ తో కూడా ఉచిత హోమ్ సర్వీస్ ను ఆఫర్ చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే, 10 వేల సెగ్మెంట్ ధరలో కొత్త 5జి చిప్ సెట్ మరియు LPDDR5 ర్యామ్ కలిగిన మొదటి ఫోన్ గా ఫోన్ ను లావా అందించిందని చెప్పొచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo