Motorola Razr 60 Ultra లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన మోటోరోలా.!
Motorola Razr 60 Ultra స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా ఈరోజు మోటోరోలా రివీల్ చేసింది
మోస్ట్ పవర్ ఫుల్ ఫ్లిప్ ఫోన్ గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి మోటోరోలా ప్లాన్ చేస్తోంది.
Motorola Razr 60 Ultra స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా ఈరోజు రివీల్ చేసింది. మోస్ట్ పవర్ ఫుల్ ఫ్లిప్ ఫోన్ గా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయడానికి మోటోరోలా ప్లాన్ చేస్తోంది. క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ మొబైల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో ఈ ఫోన్ ను అందిస్తున్నట్లు ప్రకటించి మోటోరోలా అందరినీ ఆశ్చర్యపరిచింది.
SurveyMotorola Razr 60 Ultra: లాంచ్ డేట్
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను మే 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం కంపెనీ మరియు అమెజాన్ కూడా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తున్నాయి. ఈ ఫోన్ మోస్ట్ పవర్ ఫుల్ AI ఫ్లిప్ ఫోన్ గా అవతరిస్తుందని కూడా మోటోరోలా గొప్పగా చెబుతోంది.
Motorola Razr 60 Ultra: ఫీచర్స్
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite తో లాంచ్ చేస్తోంది. ఇది 3nm చిప్ సెట్ మరియు 27 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.1 స్టోరేజ్ తో లాంచ్ అవుతుందని కూడా టీజర్ పేజీ ద్వారా మోటోరోలా ప్రకటించింది. ఇది ఆన్ డివైజ్ moto ai 2.0 తో కంప్లీట్ ఎఐ ఫీచర్ కలిగి ఉంటుందట.

ఈ ఫోన్ డిజైన్ మరియు కెమెరా వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు మరింత పటిష్టంగా ఉండే టైటానియం హింజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 50MP అల్ట్రా వైడ్/మ్యాక్రో డ్యూయల్ రియర్ మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా సిస్టం ఉంటాయి. ఈ ఫోన్ లో సూపర్ వీడియో, ఫోటో బూస్ట్ మరియు Ai కెమెరా ఫీచర్స్ ఉండే అవకాశం ఉంటుంది.
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను మూడు డిజైన్స్ మరియు కలర్ వేరియంట్స్ లో లాంచ్ చేస్తోంది. ఇందులో కొత్త వుడ్ ఫినిష్ వేరియంట్ కూడా ఉంది మరియు ఇది ప్యాంటోన్ సర్టిఫైడ్ వుడ్ ఫినిష్ తో ఉంటుంది. ఇది కాకుండా ప్యాంటోన్ స్క్రబ్ మరియు ప్యాంటోన్ రియో రెడ్ కలర్ వేరియంట్స్ కూడా ఉంటాయి.
Also Read: Amazon Sale Last Day offer: భారీ డిస్కౌంట్ 12 వేలకే లభిస్తుంది 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ.!
ఈ ఫోన్ మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా త్వరలోనే వెల్లడిస్తుందని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి మరిన్ని కీలక వివరాలు త్వరలోనే మోటోరోలా వెల్లడిస్తుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.