CMF Phone 2 Pro ఫస్ట్ సేల్ బెస్ట్ డీల్స్ మిస్సవ్వకండి: ఆఫర్ ఒక్కరోజు మాత్రమే. !

HIGHLIGHTS

CMF Phone 2 Pro ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ సింగల్ డే డీల్స్ అందించింది

ఈ ఆఫర్లు ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి

CMF Phone 2 Pro ఫస్ట్ సేల్ బెస్ట్ డీల్స్ మిస్సవ్వకండి: ఆఫర్ ఒక్కరోజు మాత్రమే. !

CMF Phone 2 Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ సింగల్ డే డీల్స్ అందించింది. అయితే, సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్లు ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

CMF Phone 2 Pro : ప్రైస్ & ఆఫర్స్

సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ను రూ. 18,999 ప్రారంభ ధరతో అందించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఫస్ట్ డే సేల్ ఆఫర్స్ తో కేవలం రూ. 16,999 రూపాయల ప్రారంభ ధరకే అందుకునే అవకాశం అందించింది.

ఏమిటా ఆఫర్స్ ?

ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ రెండు ఆఫర్లు అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల తగ్గింపు అందుకోవచ్చు. ఈ ఫోన్ ను డెబిట్ / క్రెడిట్ కార్డ్స్ EMI మరియు నాన్ EMI ఆఫర్ తో కొనే వారికి ఈ రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

CMF Phone 2 Pro : ఫీచర్స్

ఈ లేటెస్ట్ నథింగ్ స్మార్ట్ ఫోన్ 50MP వైడ్ యాంగిల్, 50MP టెలిఫోటో మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 16MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30fps తో స్టేబుల్ 4K వీడియోలు, 20X జూమ్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

CMF Phone 2 pro
CMF Phone 2 pro

ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Pro 5G చిప్ సెట్ తో చేస్తుంది మరియు 8GB ర్యామ్ తో పాటు జతగా 128GB/256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఈ ఫోన్ కేవలం 7.8mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది మరియు బ్లాక్, లైట్ గ్రీన్, ఆరెంజ్, వైట్ నాలుగు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Nothing OS 3.2 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.

Also Read: Realme 7వ యానివర్సరీ సేల్ నుంచి Realme GT 7 Pro పై 10 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.!

ఈ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో పై ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన బిగ్ డీల్స్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo