Flipkart SASA LELE సేల్ నుంచి Daiwa స్మార్ట్ టీవీల పై భారీ డీల్స్ అందించింది. దేశీయ మార్కెట్ లో బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీలు ఆఫర్ చేస్తున్న డైవా స్మార్ట్ టీవీలు ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మరింత చవక ధరకు లభిస్తాయి. ఈ సేల్ నుంచి 24 వేలకే Daiwa 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి, అని ఫ్లిప్ కార్ట్ మరియు డైవా ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఈ స్మార్ట్ టీవీ ఫుల్ ఫీచర్లు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart SASA LELE స్మార్ట్ టీవీ డీల్
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు డైవా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (D55U4WOS) పై ఈ డీల్స్ అందించింది. ఈ ఫ్లిప్ కార్ట్ మరియు డైవా ఈ స్మార్ట్ టీవీని 60% బరి డిస్కౌంట్ తో ఈరోజు సేల్ నుంచి కేవలం రూ. 25,499 ధరకే ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తున్నాయి.
ఈ డైవా స్మార్ట్ టీవీని HDFC మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ బిగ్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 23,999 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ తర్వాత అతి చవక ధరకు ఈ సేల్ నుంచి లభిస్తుంది.
ఈ డైవా స్మార్ట్ టీవీ UHD 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ వాయిస్ కంట్రోల్ LG ThinQ AI తో వస్తుంది మరియు LG WebOS పై నడుస్తుంది. ఈ టీవీ 1.5GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ డైవా స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ తో వస్తుంది మరియు 24W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB, మిర క్యాస్ట్, యూనివర్సల్ కంట్రోల్ మరియు 6 పిక్చర్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీని ఈరోజు చాలా చవక ధరకు అందుకోవచ్చు.