OnePlus 13s: సరికొత్త డిజైన్ తో వస్తున్న వన్ ప్లస్ ఫోన్.!
వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది
OnePlus 13s లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది
సరికొత్త డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది
OnePlus 13s : వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది. వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తో వన్ ప్లస్ అందించిన టీజర్ ఇమేజ్ మరియు వివరాల ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది.
SurveyOnePlus 13s: లాంచ్
వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ స్మార్ట్ ఫోన్ ను ‘Coming Soon’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. ఈ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది.
OnePlus 13s: ఫీచర్స్
వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ ను వన్ హ్యాండెడ్ ఫోన్ గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ మరియు కాంపాక్ట్ డిజైన్ తో ఉన్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ ఫోన్ ను లేటెస్ట్ మరియు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మొబైల్ చిప్ సెట్ తో వస్తోంది. అదేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క Snapdragon 8 Elite మొబైల్ చిప్ సెట్ తో లాంచ్ చేయబోతున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది.

ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని కన్ఫర్మ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో అందించిన వేగవంతమైన చిప్ సెట్ కి తగిన వేగవంతమైన LPDDR5 ర్యామ్ మరియు పెద్ద UFS 4.0 స్టోరేజ్ ను కొద అందించే అవకాశం ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ తో పాటు మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా వన్ ప్లస్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.