Realme 14T 5G: లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

Realme 14T 5G స్మార్ట్ ఫోన్ రెండు రోజులో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ రియల్ మీ రిలీజ్ చేసింది

లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ పేర్కొంది

Realme 14T 5G: లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!

Realme 14T 5G స్మార్ట్ ఫోన్ రెండు రోజులో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ రియల్ మీ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ పేర్కొంది. ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లు తీసుకునే ప్రయత్నం చేద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 14T 5G: లాంచ్

రియల్ మీ 14టి 5జి స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో వస్తుందని రియల్ మీ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.

Realme 14T 5G: ఫీచర్స్

రియల్ మీ 14టి 5జి స్మార్ట్ ఫోన్ స్టెయిన్ ఇన్స్పైర్డ్ లగ్జరీ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు సెగ్మెంట్ బ్రైట్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 111% DCI-P3, తక్కువ బ్లూ లైట్ కలిగి TUV సర్టిఫికేషన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.97mm మందంతో మాత్రమే ఉంటుంది. అయితే, ఇది సెగ్మెంట్ లీడింగ్ 6,000 mah బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

Realme 14T 5G

అంటే, ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ గా ఉండేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ఇంత బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇంత పెద్ద బ్యాటరీతో 17 గంటల Youtube వీడియో వాచ్ టైమ్ అందించే శక్తిని కలిగి ఉంటుందని కూడా గొప్పగా చెబుతోంది.

ఇక ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ IP69 వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 300% లౌడ్ అండ్ క్లియర్ సౌండ్ అందించే డ్యూయల్ స్పీకర్ సెటప్ కూడా ఉంటుందని రియల్ మీ టీజింగ్ చేస్తోంది. కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.

Also Read: ఇండియన్ మార్కెట్లో ఆరు కొత్త AC లను లాంచ్ చేసిన Elista: ప్రైస్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

రియల్ మీ 14టి 5జి స్మార్ట్ ఫోన్ ను సిల్క్ గ్రీన్, వయోలెట్ గ్రేస్ మరియు శాటిన్ ఇంక్ మూడు కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందించే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo