MOTOROLA Edge 60 Stylus ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ తో రేపు మొదలవుతుంది.!
MOTOROLA Edge 60 Stylus గత వారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది
Edge 60 Stylus భారీ ఆఫర్స్ తో ఇప్పుడు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి రాబోతుంది
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో స్టైలస్ పెన్ కలిగిన మొదటి 5జి ఫోన్ గా వచ్చింది
MOTOROLA Edge 60 Stylus స్మార్ట్ ఫోన్ బడ్జెట్ స్టైలస్ ఫోనుగా గత వారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ మోటోరోలా బడ్జెట్ స్టైలస్ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్స్ తో ఇప్పుడు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి రాబోతుంది. ఈ ఫోన్ సేల్ కంటే ముందుగా మీరు ఈ ఫోన్ గురించి తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది.
SurveyMOTOROLA Edge 60 Stylus: ధర
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 22,999 ధరతో అందించింది. ఈ ఫోన్ సింగల్ వేరియంట్లో లభిస్తుంది. ఈ ఫోన్ పై Axis మరియు IDFC కార్డు రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ తో తీసుకునే వారికి కూడా రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఒకటి మాత్రమే అందుకునే అవకాశం అందించింది.
MOTOROLA Edge 60 Stylus : ఫీచర్స్
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో స్టైలస్ పెన్ కలిగిన మొదటి 5జి ఫోన్ గా వచ్చింది. ఈ ఫోన్ లో బిల్ట్ ఇన్ స్టైలిస్ పెన్ ఉంటుంది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ Super HD (1220p) అంటే, 1.5K రిజల్యూషన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8GB ఫిజికల్, 8GB వర్చువల్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15OS పై పని చేస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం వేగాన్ లెథర్, MIL-810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేట్ మరియు IP68 వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 50MP Sony LYT మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 8MP కెమెరా కలిగిన రియర్ కెమెరా 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో సపోర్ట్ మరియు Moto Ai సపోర్ట్ తో Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.
Also Read: Vivo T4 5G: సూపర్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 15W వైర్ లెస్ ఛార్జ్ మరియు 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.