Vivo T4 5G: సూపర్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
వివో కొత్త ఫోన్ Vivo T4 5G ఈరోజు మార్కెట్లో లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ ను సూపర్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసినట్లు వివో తెలిపింది
వివో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేసింది
Vivo T4 5G: వివో కొత్త ఫోన్ ఈరోజు మర్కెట్లో లాంచ్ అయ్యింది. అదే వివో టి4 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను సూపర్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసినట్లు వివో తెలిపింది. ఈ మాట చెప్పడానికి ముఖ్యమైన కారణం ఈ ఫోన్ లో అందించిన 7300 mAh బిగ్ బ్యాటరీ మరియు Snapdragon లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉండటమే అని చెప్పవచ్చు. వివో సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాలు తెలుసుకోండి.
SurveyVivo T4 5G: ప్రైస్
ఈ వివో ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB +128GB) ను కేవలం రూ. 21,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ (8GB +128GB) ను కేవలం రూ. 25,999 రూపాయల ధరతో అందించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను మరింత తక్కువ ధరకు అందుకునేలా లాంచ్ ఆఫర్లు కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ఏప్రిల్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ Flipkart మరియు వివో అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఆఫర్స్
వివో ఈ స్మార్ట్ ఫోన్ మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై HDFC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ క్రెడిట్ కార్డు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ వివో కొత్త ఫోన్ ను ఈ రెండు బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. లేదా ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ అందిస్తుంది. ఎటు చూసినా ఈ ఫోన్ పియా రూ. 2,000 అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను 20 వేల కంటే తక్కువ ధరలో లభిస్తుంది.
Vivo T4 5G: ఫీచర్స్
వివో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Funtouch OS 15 జతగా ఆండ్రాయిడ్ 15 OS ఫై నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో అందించింది ఈ స్క్రీన్ ఇందు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ వివో స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP (OIS) (Sony IMX882) ప్రధాన కెమెరా + 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా ఫ్రెంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాలు కూడా 30fps తో 4K వీడియో రికార్డ్ చేసే సత్తా కలిగి ఉంటాయి. ఇందులో AI Erase, AI Photo Enhance వంటి మరిన్ని AI ఫీచర్స్ ఉన్నాయి.
Also Read: Sony Smart Tv పై భారీ ఆఫర్లు అనౌన్స్ చేసిన అమెజాన్.!
వివో ఈ ఫోన్ ను అత్యంత శక్తివంతమైన బ్యాటరీ కలిగిన ఫోన్ గా నిలబెట్టింది, ఎందుకంటే, ఈ ఫోన్ లో 7300 mAh సిలికాన్ కార్బన్ యానోడ్ బ్యాటరీతో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా అందించింది. ఈ ఫోన్ పటిష్టమైన మిలటరీ గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్ తో అందించింది.