Vivo T4 5G భారీ 7300 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోంది. !
Vivo T4 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసిన వివో
ఈ ఫోన్ ప్రత్యేకతలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది
వివో టి 4 5జి ను 7300 mAh హెవీ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు వివో కన్ఫర్మ్
Vivo T4 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసిన వివో ఇప్పుడు ఈ ఫోన్ ప్రత్యేకతలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ దేశంలో అతిపెద్ద బ్యాటరీ ఫోన్ గా వస్తున్నట్లు వివో ముందుగా టీజింగ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ వివరాలు కూడా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న విశేషాలు ఈరోజు చూద్దాం.
SurveyVivo T4 5G: లాంచ్
వివో టి 4 5జి స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అతిపెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు పవర్ బ్యాంక్ మాదిరిగా ఉపయోగించే ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది.
Vivo T4 5G : ఫీచర్స్
వివో టి 4 5జి స్మార్ట్ ఫోన్ ను 7300 mAh హెవీ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను అత్యంత వేగంగా ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది. ఇది కాకుండా ఈ ఫోన్ ను పవర్ బ్యాంక్ మాదిరిగా ఉపయోగించేలా రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు కూడా తెలిపింది.

వివో టి సిరీస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫోన్స్ కూడా వాటి ప్రైస్ ద్వారా సెగ్మెంట్ లో మార్కెట్లో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగిన ఫోన్లుగా నిలచాయి. ఇప్పుడు కూడా ఈ ఫోన్ ను ప్రైస్ సెగ్మెంట్ లో బిగ్ బ్యాటరీ ఫోనుగా తీసుకొస్తున్నట్లు వివో తెలిపింది. అంటే, ఈ ఫోన్ కూడా బడ్జెట్ యూజర్ ను బేస్ చేసుకుని తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు.
కేవలం బ్యాటరీ మరియు ఛార్జ్ వివరాలు మాత్రమే కాదు ఈ ఫోన్ డిజైన్ ను కూడా వివో వెల్లడించింది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా కేవలం 7.98mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుందని వివో టీజింగ్ చేస్తోంది. వివో టి 4 5జి స్మార్ట్ ఫోన్ వెనుక OIS సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరా సిస్టం తో జతగా రింగ్ ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది.
Also Read: CMF Phone 2 Pro: ప్రోసెసర్ మరియు స్క్రీన్ వివరాలు వెల్లడించింది.!
ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ AI సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. అంటే, ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ ఉంటాయి మరియు చాలా పనులకు AI సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరిన్ని వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తుందని వివో తెలిపింది. ఇంకా ఎటువంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ కలిగి ఉంటుందో చూడాలి.