Noise Air Buds Pro 6 హైబ్రిడ్ ANC మరియు LHDC తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
Noise Air Buds Pro 6 ఇయర్ బడ్స్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది
Noise Air Buds 6 యొక్క Pro వెర్షన్ గా ఈ కొత్త బడ్స్ లాంచ్ చేసింది
ఈ కొత్త ఇయర్ బడ్స్ హైబ్రిడ్ ANC మరియు LHDC తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది
Noise Air Buds Pro 6 ఇయర్ బడ్స్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇటీవల విడుదల చేసిన Noise Air Buds 6 ప్రో వెర్షన్ గా ఈ కొత్త బడ్స్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ హైబ్రిడ్ ANC మరియు LHDC తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. నోయిస్ కొత్తగా విడుదల చేసిన ఈ ఎయిర్ బడ్స్ ప్రో 6 ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.
SurveyNoise Air Buds Pro 6 : ధర
నోయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 కొత్త ఇయర్ బడ్స్ ను రూ. 3,599 ధరతో లాంచ్ చేసింది. అయితే, లాంచ్ ఆఫర్ లో భాగంగా ప్రస్తుతం అమెజాన్ నుంచి రూ. 2,999 ధరతో మరియు నోయిస్ అధికారిక వెబ్సైట్ నుంచి రూ. 3,299 ధరతో సేల్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ఇండియా మరియు gonoise.com నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ కొత్త బడ్స్ నింబస్ గ్రే, పెటల్ పింక్ మరియు స్లేట్ బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
Noise Air Buds Pro 6 : ఫీచర్స్
నోయిస్ ఈ కొత్త ఇయర్ బడ్స్ ను డ్యూయల్ స్పీకర్ తో అందించింది. ఇందులో 12.4mm టైటానియం మరియు Peek డ్రైవర్ తో అందించింది. ఇది క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందించడానికి అనువుగా ఉంటుంది మరియు సమర్ధవంతమైన క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. ఈ నోయిస్ కొత్త ఇయర్ బడ్స్ LHDC 5.0 లీనమయ్యే 24 bit / 96 kHz సూపర్ క్వాలిటీ సౌండ్ అందిస్తుంది.

నోయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 49 dB హైబ్రిడ్ ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) తో వస్తుంది. మైక్ నోయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 4 తో పోలిస్తే ఈ బడ్స్ రెండు రేట్లు బెటర్ ANC అఫర్ చేస్తుందని నోయిస్ తెలిపింది. ఈ నోయిస్ కొత్త బడ్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్, స్పెటియల్ ఆడియో, ఫాస్ట్ పైరింగ్, డ్యూయల్ డివైజ్ పైరింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Infinix Note 50s 5G: అతి సన్నని కర్వుడ్ AMOLED స్క్రీన్ తో వస్తోంది.!
ఇక ఈ బడ్స్ మరిన్ని ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ బడ్స్ మంచి క్వాలీటి కాల్స్ కోసం క్వాడ్ మైక్ ENC సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ టోటల్ 50 గంటల ప్లే టైమ్ అందిస్తుంది (బడ్స్ 7H + కేస్ 43H). ఎయిర్ బడ్స్ ప్రో 6 ఇయర్ బడ్స్ గొప్ప కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3, రక్షణ కోసం IPX5 వాటర్ రెసిస్టెంట్ మరియు హైపర్ షింక్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.