CMF Phone 2 Pro తో పాటు మూడు కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.!

HIGHLIGHTS

CMF లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ ప్రొడక్ట్స్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది

నెల చివరి వారంలో ఈ అప్ కమింగ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది

CMF Phone 2 Pro మరియు మూడు కొత్త బడ్స్ సెట్స్ ఉన్నాయి

CMF Phone 2 Pro తో పాటు మూడు కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.!

నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఇండియాలో లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ ప్రొడక్ట్స్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ నెల చివరి చివరి వారంలో ఈ అప్ కమింగ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో CMF Phone 2 Pro మరియు మూడు కొత్త బడ్స్ సెట్స్ ఉన్నాయి. ఫోన్ 1 తో మార్కెట్ లో గ్రాబ్ చేసిన CMF ఇప్పుడు అప్ కమింగ్ ఈ ఫోన్ యొక్క కొత్త జెనరేషన్ ఫోన్ ను లాంచ్ చేయడానికి చూస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

CMF Phone 2 Pro ఎప్పుడు లాంచ్ అవుతుంది?

నథింగ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ యొక్క అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఇండియన్ మార్కెట్లో ఏప్రిల్ 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని కంపెనీ ఈ రోజు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు మూడు కొత్త బడ్స్ కూడా లాంచ్ చేయబోతున్నట్లు కూడా అనౌన్స్ చేసింది.

ఈ ఫోన్ తో లాంచ్ కానున్న బడ్స్ ఏమిటి?

సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో తో పాటు బడ్స్ 2, బడ్స్ 2a మరియు బడ్స్ 2 ప్లస్ మూడు బడ్స్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ కమింగ్ ఫోన్ మరియు బడ్స్ లాంచ్ కోసం చాలా సమయం ఉంది కాబట్టి ఈ అప్ కమింగ్ ప్రోడక్ట్స్ కీలకమైన ఫీచర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేసే అవకాశం ఉండవచ్చు.

Also Read: iQOO Z10 5G: స్నాప్ డ్రాగన్ కొత్త చిప్ సెట్ మరియు 24GB ర్యామ్ తో లాంచ్ అవుతుంది.!

ఈ ఫోన్ టీజర్ ఏమి చెబుతోంది?

ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ ద్వారా, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ముందుగా వచ్చిన సిఎంఎఫ్ ఫోన్ 1 మాదిరి స్క్రూ డిజైన్ తో ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అయితే, సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ముందుగా వచ్చిన ఫోన్ కంటే మరింత స్లీక్ డిజైన్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

అయితే, ఈ ఫోన్ సింగల్ కెమెరా కలిగి ఉంటుందదేమో అనిపించేలా ముందు టీజర్ హింట్ ఇస్తోంది. ఎందుకంటే, ఫస్ట్ అందించిన టీజర్ లో ఫోన్ లో సిగంల్ కెమెరా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, ఈ ఫోన్ ను పర్ఫెక్ట్ షాట్ అందించే ఫోన్ గా సిఎంఎఫ్ అభివర్ణించింది. మరి ఈ ఫోన్ లో ఎటువంటి కెమెరా అందిస్తోంది వేచి చూడాల్సి ఉంటుంది.

ఏది ఏమైనా సిఎంఎఫ్ అందించిన లాంచ్ టీజర్ తో అప్ కమింగ్ ప్రొడక్ట్స్ పై మంచి అంచనాలు రేకెత్తించింది. ఈ ఫోన్ లేటెస్ట్ అప్డేట్స్, లీక్స్ మరియు కొత్త వివరాలతో మళ్ళి కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo