10 వేల బడ్జెట్ ధరలో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో వచ్చిన Lava Bold 5G ఫస్ట్ సేల్.!
3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయిన Lava Bold 5G ఫస్ట్ సేల్
ఈ ఫోన్ భారతదేశంలో 10 వేల బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది
ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరలో గొప్ప ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది
భారతదేశంలో 10 వేల బడ్జెట్ ధరలో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయిన Lava Bold 5G ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరలో గొప్ప ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రేటు మరియు ఫీచర్స్ పరంగా ఇప్పటికే మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
SurveyLava Bold 5G: ధర మరియు సేల్
లావా బోల్డ్ 5జి స్మార్ట్ ఫోన్ ను ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 10,499 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ సఫైర్ బ్లూ కలర్ లో లభిస్తుంది.
Lava Bold 5G: ఫీచర్స్
లావా బోల్డ్ 5జి స్మార్ట్ ఫోన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.67 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ అవుతుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, అధిక బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ బడ్జెట్ 5G చిప్ సెట్ కి జతగా 8GB ఫిజికల్ ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ పై కూడా వర్చువల్ ర్యామ్ ను అందిస్తోంది.
లావా ఈ ఫోన్ ను 64MP Sony మెయిన్ సెన్సార్ కలిగిన దూల రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరాతో కలిగి ఉంటుంది. ఈ లావా ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 14 OS తో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ 15 OS అప్గ్రేడ్ తో పాటు 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Soundbar Deal: కేవలం రూ. 2,999 కే పవర్ ఫుల్ సౌండ్ అందుకోండి.!
ఇక ఈ ఫోన్ యొక్క మరిన్ని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ లావా ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఆలాగే, ఈ ఫోన్ AGC గ్లాస్ ప్రొటక్షన్ ను కూడా కలిగి ఉంటుంది. లావా ఈ ఫోన్ పై కూడా ఉచిత హోమ్ సర్వీస్ ను ఆఫర్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కు ఏదైనా సమస్య వస్తే సర్వీస్ ను ఇంటి వద్దనే పొందవచ్చు.