Vivo V50e లాంచ్ డేట్, స్పెక్స్ మరియు ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ.!
Vivo V50e స్మార్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ప్రకటించింది
స్పెక్స్ మరియు ఫీచర్స్ ను సైతం వివో రివీల్ చేసింది
ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది
Vivo V50e స్మార్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్, స్పెక్స్ మరియు ఫీచర్స్ ను సైతం వివో రివీల్ చేసింది. వివో అప్ కమింగ్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వివో అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లగ్జరీ డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది. వివో విడుదల చేయనున్న అప్ కమింగ్ ఫోన్ వివో వి 50e స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో ఒక లుక్కేద్దామా.
SurveyVivo V50e : లాంచ్ డేట్
వివో వి 50e స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. లాంచ్ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Vivo V50e : ఫీచర్స్
ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లగ్జరీ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సఫైర్ బ్లూ కలర్ మరియు ప్రీమియం గ్లాసీ బ్యాక్ ప్యానల్ తో ఈ ఫోన్ చాలా అందంగా కన్పిస్తోంది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ముందు 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా మరియు వెనుక 50MP Sony IMX882 మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ కెమెరా AI కెమెరా ఫీచర్స్, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు వెడ్డింగ్ పోర్ట్రైట్ స్టైల్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. వివో వి 50e స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ఫానైట్ వ్యూవింగ్ అనుభూతిని అందిస్తుందని వివో చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ ప్రీమియం డైమండ్ షీల్డ్ గ్లాస్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 17 వేలకే లభిస్తున్న పెద్ద 4K QLED Smart Tv డీల్స్ ఇవే.!
వివో వి 50e స్మార్ట్ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ వివరాలను కంపెనీ రివీల్ చేసింది. వీటితో పాటు ఈ ఫోన్ లో పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు ఆండ్రాయిడ్ 15OS తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.