iQOO Neo 10R: భారీ ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరతో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

ఐకూ నియో 10R ఈరోజు ఎట్టకేలకు విడుదల చేయబడింది

ఈ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరతో లాంచ్ చేసింది

ఈ ఫోన్ వేగవంతమైన చిప్ సెట్ మరియు తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది

iQOO Neo 10R: భారీ ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరతో లాంచ్ అయ్యింది.!

iQOO Neo 10R: ఐకూ చాలా రోజులుగా టీజింగ్ చేస్తున్న ఫోన్ ఐకూ నియో 10R ఈరోజు ఎట్టకేలకు విడుదల చేయబడింది. ఈ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరతో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ డిజైన్ పరంగా గొప్పగా అనిపిస్తుంది మరియు ఈ ఫోన్ లో వేగవంతమైన చిప్ సెట్ మరియు తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రేటుతో కంపెనీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎక్కువ కాంపిటీషన్ ను అందించింది. ఈ రోజే సరికొత్తగా విడుదలైన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Neo 10R: ఫీచర్స్

ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్స్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hzరిఫ్రెష్ రేట్, HDR10+, Netflix HDR మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో HDR10+ వంటి గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో వస్తుంది మరియు ఇది 1.7Mn+ AnTuTu స్కోర్ అందిస్తుంది. దీనికి జతగా 12GB LPDDR5X ఫిజికల్ ర్యామ్ + 12GB ఎక్స్టెండెడ్ ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది.

iQOO Neo 10R

ఈ ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 50MP Sony IMX882 మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, AI కెమెరా ఫీచర్స్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ భారీ 6400 mAh బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫన్ టచ్ OS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది.

iQOO Neo 10R: ప్రైస్

ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో అందించింది. ఈ మూడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.

ఐకూ నియో 10R (8GB + 128GB) వేరియంట్ ధర : రూ. 26,999

ఐకూ నియో 10R (8GB + 256GB) వేరియంట్ ధర : రూ. 28,999

ఐకూ నియో 10R (12GB + 256GB) వేరియంట్ ధర : రూ. 30,999

Also Read: Xiaomi 15 Ultra: పవర్ ఫుల్ కెమెరా మరియు చిప్ సెట్ తో లాంచ్..!

ఆఫర్స్ :

ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ ఆఫర్స్ కూడా ఐకూ అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ లేదా రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను SBI, ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ ఈరోజు నుంచే ప్రారంభించింది. ఈ ఫోన్ ను అమెజాన్ మరియు iqoo.com నుంచి ప్రీ బుక్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo