Xiaomi 15 Ultra: పవర్ ఫుల్ కెమెరా మరియు చిప్ సెట్ తో లాంచ్..!
Xiaomi 15 Ultra ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
పవర్ 200MP అల్ట్రా టెలిఫోటో సెన్సార్ ఈ ఫోన్ లో ఉంది
Snapdragon 8 Elite వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్ తో లాంచ్
Xiaomi 15 Ultra: ఎట్టకేలకు షియోమీ పవర్ ఫుల్ హై ఎండ్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఎన్నడూ లేనివిధంగా 200MP అల్ట్రా టెలిఫోటో సెన్సార్ కలిగిన పవర్ ఫుల్ కెమెరా మరియు క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్ తో లాంచ్ చేసింది. అఫ్ కోర్స్, ఈ ఫోన్ రేటు కూడా దానికి తగ్గట్టుగానే చాలా ప్రియంగా ఉందనుకోండి.
SurveyXiaomi 15 Ultra: ఫీచర్స్
షియోమీ 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను ఇప్పటి వరకు ఉన్న వాటిలో అత్యంత వేగవంతమైన ప్రోసెసర్ గా చెప్పబడుతున్న Snapdragon 8 Elite తో అందించింది. ఈ వేగవంతమైన ప్రోసెసర్ కి మరింత వేగాన్ని జత చేసే 16GB LPDDR5X 8533Mbps ర్యామ్ మరియు ఫాస్ట్ UFS 4.1 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో Qualcomm AI engine కూడా జతగా ఉంటుంది.
ఈ ఫోన్ లో గొప్ప స్క్రీన్ ను కూడా షియోమీ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ లో 6.73 క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ ను అందించింది. ఈ స్క్రీన్ WQHD+ (3200 x 1440) రిజల్యూషన్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1-120 రిఫ్రెష్ రేట్ మరియు అల్ట్రా సోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ స్క్రీన్ 1920Hz PWM డిమ్మింగ్, HDR10+, Dolby Vision మరియు ఒరిజినల్ కలర్ ప్రో వంటి మరిన్ని ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP LYT-900 మెయిన్ సెన్సార్ + లైకా 200MP అల్ట్రా టెలిఫోటో + 50MP లైకా ఫ్లోటింగ్ టెలిఫోటో + 50MP లైకా అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన క్వాడ్ రియర్ కెమెరా ఉంది. ఈ ఫోన్ కెమెరా లైకా కెమెరా ఫిల్టర్స్,120X డిజిటల్ జూమ్, సూపర్ మ్యాక్రో 16-బిట్ అల్ట్రా RAW వంటి కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 30FPS తో 8K (7680×4320) వీడియో రికార్డింగ్, 30,60,120FPS తో 4K (3840×2160) వీడియో రికార్డింగ్ మరియు 1920fps సూపర్ స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసే సత్తా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఇందులో 4K Dolby Vision వీడియో రిక్డార్డ్ సపోర్ట్ కలిగిన 32MP ఇన్ స్క్రీన్ సెల్ఫీ కెమెరా కూడా వుంది.
ఈ ఫోన్ ను 90W హైపర్ ఛార్జ్ మరియు 80W వైర్లెస్ హైపర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5410 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఫోన్ కూలింగ్ కోసం షియోమీ 3D డ్యూయల్ ఛానల్ ఐస్ లూప్ సిస్టం కూడా అందించింది. ఈ ఫోన్ Dolby Atmos, Hi-Res మరియు Hi-Res Audio వైర్లెస్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అలాగే, IP68 రేటింగ్ స్ప్లాష్, వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.
Also Read: Realme P3 5G: కొత్త చిప్ సెట్ మరియు కొత్త డిజైన్ తో లాంచ్ అవుతోంది.!
Xiaomi 15 Ultra: ప్రైస్
షియోమీ ఈ ఫోన్ ను కేవలం 16GB + 512 సింగల్ వేరియంట్ మరియు సిల్వర్ క్రోమ్ సింగల్ కలర్ తో రూ. 1,09,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ గొప్ప ఆఫర్లు కూడా అనౌన్స్ చేసింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను ప్రీ బుకింగ్ చేసుకునే వారికి రూ. 11,999 రూపాయల విలువైన ఫోటోగ్రఫీ కిట్ మరియు ICICI బ్యాంక్ కార్డ్ తో బుక్ చేసే వారికి రూ. 10,000 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, రూ. 21,999 విలువైన బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ ప్రీ బుకింగ్ మార్చి 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.