HIGHLIGHTS
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ P3 5G లాంచ్ డేట్ అనౌన్స్
రెండు కొత్త ఫోన్లు విడుదల చేయడానికి Realme రెడీ అయ్యింది
ఈ ఫోన్ కొత్త చిప్ సెట్ మరియు కొత్త డిజైన్ తో లాంచ్ అవుతోంది
Realme P3 5G: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ P3 5G లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇదే సిరీస్ నుంచి ముందుగా P3 Pro 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన రియల్ మీ, ఇదే సిరీస్ నుంచి ఇప్పుడు రెండు కొత్త ఫోన్లు విడుదల చేయడానికి రెడీ అయ్యింది. ఇందులో ఒకటి Realme P3 ultra కాగా రెండవది రియల్ మీ పి3 5జి. వీటిలో పి3 5జి ఫోన్ బడ్జెట్ వేరియంట్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ కొత్త చిప్ సెట్ మరియు కొత్త డిజైన్ తో లాంచ్ అవుతోంది.
Surveyరియల్ మీ పి3 5జి స్మార్ట్ ఫోన్ కూడా రియల్ మీ పి3 అల్ట్రా ఫోన్ తో పాటు మార్చి 19వ తేదికి ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం కూడా Flipkart సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది. ఈ ప్రత్యేకమైన పేజీ నుంచి రియల్ మీ పి 3 5జి కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది.
Also Read: Holi 2025 Offer: పవర్ ఫుల్ డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar పై భారీ డిస్కౌంట్.!
రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను స్లీక్ మరియు ఆకట్టుకునే కొత్త బ్యాక్ ప్యానల్ డిజైన్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ ఇండియాలో Snapdragon 6 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్ అవుతుంది. ఈ చిప్ సెట్ 7,50,000 కు పైగా AnTuTu స్కోర్ ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనికి జతగా 18GB ర్యామ్ ఫీచర్ మరియు 256GB గరిష్టంగా స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ రియల్ మీ ఫోన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, AI ఐ కేర్ ప్రొటెక్షన్, BGMI 90 fps సపోర్ట్ కలిగిన AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ పెద్ద కూలింగ్ సిస్టం మరియు IP69 వాటర్ ప్రూఫ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.