Xiaomi 15 Launch: షియోమీ ప్రీమియం ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది.!
ఇండియాలో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
షియోమీ ప్రీమియం ఫోన్ సిరీస్ నుంచి Xiaomi 15 లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది
షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ విశేషాలు ఏమిటో చూద్దామా
Xiaomi 15 Launch: ఇండియాలో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. షియోమీ ప్రీమియం ఫోన్ సిరీస్ నుంచి షియోమి 15 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క వివరాలు తెలియ చేసే టీజర్ ఇమేజ్ ను కూడా షియోమీ రిలీజ్ చేసింది. షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ విశేషాలు ఏమిటో చూద్దామా.
SurveyXiaomi 15 Launch ఎప్పుడు అవుతుంది?
షియోమి 15 స్మార్ట్ ఫోన్ ను మార్చి 2వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ఇండియాలో విడుదల చేయడానికి డేట్ మరియు టైం ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ కేవలం ఇండియాలో మాత్రమే కాదు గ్లోబల్ మార్కెట్ లో కూడా ఒకసారి విడుదల చేయబడుతుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ను ‘The Next Pinnacle’ క్యాప్షన్ తో కంపెనీ టీజ్ చేస్తోంది. ‘తదుపరి శిఖరాగ్రం’ అనే అర్ధం తో ఈ ఫోన్ క్యాప్షన్ అందించింది. అంటే, ఈ ఫోన్ గొప్ప ఫీచర్స్ మరియు స్పెక్స్ తో వస్తుందని మరియు మరొక కొత్త మైల్ స్టోన్ ను సెట్ చేస్తుందని కంపెనీ హింట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది.
Xiaomi 15 : ఫీచర్స్
ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ లేదా స్పెక్స్ వంటి వివరాలు షియోమి ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా కొన్ని ఫీచర్లు వెల్లడి అవుతున్నాయి. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో వెనుక ప్రీమియం లెథర్ డిజైన్ ఉన్నట్లు కనిపిస్తుంది. షియోమి 15 లో లెథర్ వేరియంట్ కూడా వుండే అవకాశం ఉంటుందని ఈ ఇమేజ్ ద్వారా అర్థం అవుతోంది.
ఈ ఫోన్ లో వెనుక పెద్ద రౌండ్ బంప్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. అది కూడా ఇందులో LEICA కెమెరా సెటప్ ఉన్నట్లు బ్రాండింగ్ పేరు మరియు వివరాలు కూడా అందించింది. ఈ ఫోన్ లో కెమెరా బంప్ దాదాపు ఫోన్ పై భాగం మొత్తం పరుచుకొని ఉంటుంది.
Also Read: Samsung Galaxy M16 మరియు M06 లాంచ్ అనౌన్స్ చేసిన శామ్సంగ్.!
అంతేకాదు, ఈసారి కెమెరా సెటప్ ను కూడా విభిన్నంగా అందించింది. ఇందులో పెద్ద పెరిస్కోప్ కెమెరా మరియు మూడు ఇతర సెన్సార్లు ఉంటాయి. ప్రస్తుతానికి, షియోమీ ఈ ఫోన్ ఫోన్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడించక పోయినా ఈ ఫోన్ లాంచ్ కోసం ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ ఫోన్ ఫీచర్స్ ను కూడా త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.