Boat Nirvana: బడ్జెట్ ధరలో Hi Res Audio మరియు LDAC తో కొత్త బడ్స్ ప్రకటించింది.!
బోట్ ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది
బడ్జెట్ ధరలో Hi Res Audio మరియు LDAC సపోర్ట్ తో లాంచ్ చేసింది
ఈ నిర్వాణ బడ్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ సౌండ్ అందిస్తుంది
Boat Nirvana: ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ బోట్ ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ ను బడ్జెట్ ధరలో Hi Res Audio మరియు LDAC సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఈ నిర్వాణ బడ్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ సౌండ్ అందిస్తుంది, అని బోట్ గొప్పగా చెబుతోంది.
SurveyBoat Nirvana: లాంచ్
బోట్ ఈ కొత్త బడ్స్ ను రేపు లాంచ్ చేస్తున్నట్టు చెబుతోంది. అయితే, ఈ బడ్స్ యొక్క ధర మరియు పూర్తి ఫీచర్స్ ఈరోజే వెల్లడించింది. ఈ బడ్స్ ను కేవలం రూ. 2,799 రూపాయల అతి తక్కువ ధరతో లాంచ్ చేసింది. అయితే, రేపు లాంచ్ అయిన వెంటనే సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ బడ్స్ బోట్ అధికారిక వెబ్సైట్ మరియు అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతుంది. ఈ బడ్స్ పై అందించే ఆఫర్స్ రేపు వెల్లడిస్తుందని ఊహిస్తున్నారు.
Also Read: బెస్ట్ డీల్ SAMSUNG Galaxy F06 5G ఫోన్ ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది.!
Boat Nirvana: ఫీచర్స్
బోట్ ఈ బడ్స్ ను స్టన్నింగ్ డిజైన్ మరియు కలర్ తో అందించింది. ఈ బడ్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ బోట్ కొత్త బడ్స్ ను బ్యాలెన్స్ సౌండ్ అందించే డ్యూయల్ డ్రైవర్స్ తో అందిస్తోంది. ఇందులో 10mm డైనమిక్ స్పీకర్ మరియు Knowles Hi-Fi బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ కూడా ఉంటుంది. ఈ సెటప్ తో గొప్ప డీటైల్డ్ సౌండ్ ను ఆస్వాదించవచ్చని బోట్ తెలిపింది.

ఈ నిర్వాణ బడ్స్ క్వాడ్ AI-ENX టెక్ వస్తుంది మరియు గొప్ప కాల్ సపోర్ట్ అందిస్తుందని కూడా బోట్ చెబుతోంది. ఈ బడ్స్ 24bit / 96 kHz క్రిస్టల్ క్లియర్ ఆడియో అందిస్తుంది. ఈ బడ్స్ Hi-Res Audio Wireless మరియు LDAC సపోర్ట్ తో లీనమయ్యే గొప్ప సౌండ్ ను అందిస్తుందిట. ఇందులో ఇన్ ఇయర్ డిటెక్షన్ మరియు 40 గంటల లాంగ్ ప్లే టైమ్ అందించే బిగ్ బ్యాటరీ సపోర్ట్ కూడా అందించింది.