SAMSUNG Galaxy F06 5G స్మార్ట్ ఫోన్ గత వారం ఇండియాలో లాంచ్ అయ్యింది. శామ్సంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ మొదటి సేల్ నుంచి మంచి ఆఫర్లు కూడా అందించింది. రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
SAMSUNG Galaxy F06 5G: ప్రైస్
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది 4GB + 128GB వేరియంట్ రూ. 9,999 ధరతో మరియు 6GB + 128GB వేరియంట్ రూ. 11,499 ధరతో లభిస్తాయి. ఈ రెండు వేరియంట్స్ పై రూ. 500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను Axis మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ PLS LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ HD+ (1600 x 720) రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు HD గేమ్ సపోర్ట్ తో వస్తుంది. శామ్సంగ్ ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్, 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా మరియు 2MP సెకండరీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 4 మేజర్ OS అప్గ్రేడ్స్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్ లను అందుకుంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి. ఈఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.