Xiaomi mega Clearance sale నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. 2025 కొత్త సంవత్సరం శుభారంభంగా అందించిన ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ షియోమీ సేల్ నుంచి కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోవచ్చు. అంతగా స్మార్ట్ టీవీ రేట్లు షియోమీ తగ్గించింది. కేవలం స్మార్ట్ టీవీలు మాత్రమే కాదు ఈ సేల్ నుంచి మరిన్ని ప్రొడక్ట్స్ పై కూడా గొప్ప డీల్స్ షియోమీ అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Xiaomi mega Clearance sale : డీల్
షియోమీ మెగా క్లియరెన్స్ సేల్ నుంచి షియోమీ Mi TV 5X Series 50 ఇంచ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో 43 ఇంచ్ టీవీ రేటుకే ఆఫర్ చేస్తోంది. ఇండియాలో రూ. 41,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ ఇప్పుడు షియోమీ మెగా క్లియరెన్స్ సేల్ నుంచి రూ. 15,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
ఈ షియోమీ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Dolby Vision, HDR10+, HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ మెటాలిక్ డిజైన్ తో వస్తుంది మరియు Vivid Picture Engine 2 ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ షియోమీ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 40W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Atmos మరియు DTS-HD సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ షియోమీ టీవీలో HDMI 2.1 x 3, 2 USB, ఆప్టికల్, ఈథర్నెట్ AV in, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.